వీఆర్‌జీఆర్ పతాకంపై రూపొందుతున్న‘యూజ్ఫుల్ఫెలోస్’తో పాటు మరో సినిమా ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గొంగటి వీరాంజనేయనాయుడు నిర్మిస్తున్నారు.ఫిల్మీగ్యాంగ్స్టర్స్, మహేష్ గంగిమల్ల దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, అడిషనల్ సెక్రటరీ కాళీకుమార్ కెమెరాస్విఛాన్ చేశారు. ఐఏఎస్ అధికారి చిరంజీవులు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘హారర్, యూత్‌ఫుల్ కాన్సెప్ట్‌లతో ఈ సినిమాలను నిర్మిస్తున్నా. కొత్త దర్శకులు చెప్పిన కథాంశాలు నచ్చడంతో ఒకేసారి రెండు సినిమాల్ని రూపొందించాలని నిర్ణయించుకున్నాం. త్వరలో నటీనటుల వివరాల్ని వెల్లడిస్తా’అని తెలిపారు. యూజ్లెస్ఫెలోస్గా ఉన్న కొందరు యువకులు సమాజానికి ఎలా మంచి చేశారన్నది‘యూజ్ఫుల్ఫెలోస్’ కథాంశామని దర్శకుడు అన్నారు.