Vaari Jaavan | బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ధురందర్: ది రివెంజ్’ (Dhurandhar The Revenge). థియేటర్లలో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలలో కూడా అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా ఒకవైపు ఓటీటీలలో సెన్సేషన్ సృష్టిస్తుండగా, తాజాగా ఈ సినిమాలోని మోస్ట్ అవేటెడ్ సాంగ్ ‘వారిజవాన్’ (Vaari Jaavan) 8K ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రానికి శషాస్వత్ సచ్దేవ్ అదిరిపోయే సంగీతాన్ని అందించారు. పంజాబీ మరియు ఇంటెన్స్ ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ (EDM) ఫ్యూజన్‌తో కూడిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్‌ను జ్యోతి నూరన్, రెబెల్ తమ పవర్ఫుల్ వాయిస్‌తో అద్భుతంగా ఆలపించారు. ఈ పాటకు జాస్మిన్ శాండ్లాస్, రెబెల్ క్యాచీ లిరిక్స్ అందించారు. తాజాగా విడుదలైన ఈ 8K అల్ట్రా హెచ్డీ వీడియో సాంగ్‌లో రణవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, అదిరిపోయే మాస్ వైబ్స్ మరియు ఎనర్జీ ప్రేక్షకులను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. జియో స్టూడియోస్ మరియు బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రంలో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.