Vaarasudu Movie | వారసుడు మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
దళపతి విజయ్ నటించిన ద్విభాషా చిత్రం 'వారసుడు'. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న తమిళంలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Vaarasudu Movie Ott Partner | దళపతి విజయ్ నటించిన ద్విభాషా చిత్రం ‘వారసుడు’. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 11న తమిళంలో రిలీజైంది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. పలు తెలుగు సినిమాల ఛాయలు ఈ సినిమాలో కనిపించాయని రివ్యూలు వచ్చాయి. అయితే తమిళ తంబీలకు ఈ సినిమా బాగానే నచ్చినట్టుంది. తొలి రెండు రోజుల్లోనే దాదాపు రూ.35 నుండి 40 కోట్ల రేంజ్లో కలెక్షన్లు సాధించి వసూళ్ల పరంగా దూసుకుపోతుంది. కాగా శనివారం తెలుగు వెర్షన్ విడుదలైంది. కథ కొత్తదనం లేకున్నా.. కథనం, ఎమోషనల్ సీన్లు, కుటుంబ బంధాలను చక్కగా చూపించడంలో వంశీ సఫలం అయినట్లు టాక్ వస్తుంది.
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియోన్స్ నుండి ఈ సినిమాకు బాగానే ఆదరణ దక్కుతున్నట్లు తెలుస్తుంది. బుకింగ్స్ కూడా పర్వాలేదనిపించేలా ఉన్నట్లు టాక్. ఇక పోతే ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఎనిమిది నుండి పది వారాల మధ్యలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు దిల్‌రాజు, ప్రైమ్ సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాడట. ఇక వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు పోటీగా ఉన్నా.. ఫ్యామిలీ ఆడియోన్స్ ఈ సినిమాకే ఓటు వేస్తున్నారని టాక్. అంతేకాకుండా సంక్రాంతికి దిల్‌రాజు నుండి వచ్చిన ఏ సినిమా కూడా ఇప్పటి వరకు ఫ్లాప్ అవలేదు. ఈ నేపథ్యంలో వారసుడు కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృందం ధీమాగా ఉన్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

