Vaarasudu Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న వారసుడు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన 'వారసుడు' తమిళంలో సూపర్ హిట్టయి తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. తుపాకీ తర్వాత అంచెలంచెలుగా మార్కెట్ విస్తరించుకుంటున్న విజయ్‌కు గత రెండు మూడు సినిమాలు తెలుగులో ఆశించ
Vaarasudu Movie On Ott | ఎన్నో వివాదాల నడుమ సంక్రాంతి కానుకగా రిలీజైన ‘వారసుడు’ తమిళంలో సూపర్ హిట్టయి తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించకుండానే థియేటర్లలో నుండి వెళ్లిపోయింది. ‘తుపాకీ’ తర్వాత అంచెలంచెలుగా మార్కెట్ విస్తరించుకుంటున్న విజయ్‌కు గత రెండు మూడు సినిమాలు తెలుగులో ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. అయితే వారసుడు మూవీకి విజయ్‌కు తెలుగులో ఉన్న మార్కెట్ కంటే ఎక్కువే బిజినెస్ జరిగింది. దాంతో బ్రేక్ ఈవెన్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోయింది. పైగా వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి మాస్ కమర్షియల్ సినిమాలు పోటీగా ఉండటం.. ప్రేక్షకులందరూ వాటికే ఓటేయడంతో తెలుగులో యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంది. వంశీపైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ సంస్థ దక్కించుకుంది. కాగా ఫిబ్రవరి 22నుండి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించింది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాడు. నిజానికి ఈ సినిమా జనవరి 11నే తెలుగులో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మూడు రోజులు వెనక్కి జరిగింది. అయితే ముందచ్చుంటే మాత్రం ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. ఇక ఇప్పటి వరకు టోటల్‌గా ఈ మూవీ రూ.200 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

