Vaarasudu Movie | తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికి గుర్తొచ్చిందా ‘వారసుడు’ గారు..!
ఒకప్పటితో పోలిస్తే విజయ్ సినిమాలకు తెలుగులో ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోయింది. అప్పట్లో ఈయన సినిమాలు తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచించే వాళ్ళు. అసలు ఈయన సినిమా విడుదల చేస్తే కనీసం
Vaarasudu Movie Promotions | ఒకప్పటితో పోలిస్తే విజయ్ సినిమాలకు తెలుగులో ఇప్పుడు మార్కెట్ బాగా పెరిగిపోయింది. అప్పట్లో ఈయన సినిమాలు తెలుగులో విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచించే వాళ్ళు. అసలు ఈయన సినిమా విడుదల చేస్తే కనీసం పోస్టర్ ఖర్చులైనా వస్తాయా రావా అని అవమానించిన వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇవన్నీ గతం.. ఇప్పుడు విజయ్ సినిమా తెలుగులో కూడా మారిపోయింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలు టాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అదిరింది నుంచి వరుసగా విజయాలు అందుకుంటున్నాడు విజయ్. దాంతో తెలుగులోనే ఈయన మార్కెట్ దాదాపు 15 కోట్ల వరకు చేరుకుంది. దానికి తోడు ఇప్పుడు దిల్ రాజు నిర్మాతగా వారసుడు సినిమా చేయడంతో.. ఏకంగా తెలుగులో పెద్ద మార్కెట్ పై కన్నేసాడు విజయ్.
వంశీ పైడిపల్లి లాంటి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం కూడా దీనికి బాగా కలిసొస్తుంది. ఇద్దరు తెలుగు వాళ్ళు ఈ సినిమాకు అండగా ఉన్న టాలీవుడ్ లో మాత్రం ప్రమోషన్ చాలా నీరసంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే తమిళ సినిమా కావడంతో ఎక్కువగా చెన్నైలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే మెట్రో ట్రైన్స్ పై డిజిటల్ ప్రమోషన్ పాటు పెద్ద పెద్ద హోర్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. కానీ తెలుగులో మాత్రం ఇప్పటి వరకు కనీసం ఒక పోస్టర్ విడుదల చేయలేదంటే నమ్మడం సాధ్యం కాదు. ఇన్ని రోజుల తర్వాత ఇది చేశారు దర్శక నిర్మాతలు.
ఎందుకో తెలియదు కానీ టాలీవుడ్ లో వారసుడు ప్రమోషన్ చాలా వీక్ గా జరుగుతుంది. రంజితమే పాట తమిళంలో విడుదలైన నాలుగు వారాలకు తెలుగులో విడుదల చేశారు. రెండో పాట ఇప్పటి వరకు తెలుగు వర్షన్ రానేలేదు. ఇదిలా ఉంటే తాజాగా వారసుడు తెలుగు పోస్టర్స్ ఇప్పుడు విడుదల చేశారు మేకర్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చెన్నైలో డిసెంబర్ 24న భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో డిసెంబర్ 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని తెలుస్తోంది. జనవరి 12న వారసుడు విడుదల కానుంది. మొత్తానికి రిలీజ్ టైం కు తెలుగు వర్షన్ ప్రమోషన్స్ కూడా పెంచాలని ఆలోచిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. అలా చేస్తే గాని ఇక్కడ కలెక్షన్స్ రావు. ఎందుకంటే ఇద్దరు పెద్ద హీరోలతో పోటీ పడుతున్నప్పుడు కచ్చితంగా ప్రమోషన్ కూడా అదే స్థాయిలో ఉండాలి.. లేదంటే అసలుకే మోసం వస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. నెట్‌ఫ్లిక్స్‌లో ‘మెగావర్స్’ టాక్ షో,15 ఎపిసోడ్స్‌తో భారీ ప్లాన్!
Imam Salary | మౌజన్.. ఇమామ్‌ల వేతనగోస.. ఏడు నెలలుగా 16,379 మంది ఎదురుచూపులు
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు త్రిగుణ్ వార్నింగ్.. షాలిని గురించి చెబుతూ ఎమోషనల్!
KRMB Meeting | కేఆర్ఎంబీ సమావేశం మళ్లీ వాయిదా.. ఇరు రాష్ర్టాలకు బోర్డు లేఖ
JEE Main | విద్యార్థులకు ఎన్టీఏ గుడ్‌న్యూస్.. ఇకపై ఒకే లాగిన్‌తో జేఈఈ రిజిస్ట్రేషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

