Ustaad Bhagat Singh | టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ (Pawan kalyan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో ఒకటి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ సినిమాకు గబ్బర్ సింగ్ ఫేమ్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీ 2022లోనే మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయం కావడంతో వాయిదా పడింది. ఇక ఈ మూవీ నుంచి అప్డేట్ లేక చాలారోజుల అవుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ అప్డేట్ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్.
ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ రాబోతుందని తెలిపింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి మీరు ఊహించని అప్డేట్ రానుంది. సిద్ధంగా ఉండండి’ అని మైత్రీ మూవీ మేకర్స్ రాసుకోచ్చింది. అయితే ఈ అప్డేట్ ఎప్పుడు విడుదల చేస్తారు అనేది మాత్రం వెల్లడించలేదు. ఇక చాలా రోజుల తర్వాత మూవీ నుంచి అప్డేట్ రానుండటంతో ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.
Expect the unexpected 💣💣#UstaadBhagatSingh ❤️🔥 https://t.co/oHyq3W5FGn
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 16, 2024