Usha Parinayam | నువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చవ్, మల్లీశ్వరీ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.విజయభాస్కర్ చాలా కాలం విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా, తాన్వీ ఆకాంక్ష హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మించాడు. లవ్ఈజ్ బ్యూటీ ఫుల్ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది.
లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలతో పాటు క్యూట్ లవ్‌స్టోరీ ప్రధానాంశంగా రూపొందింది. కథాంశం కొత్తది కాకపోయినా దానిని ప్రజెంట్ చేసిన విధానం స్క్రీన్‌ప్లేలో దర్శకుడు విజయ్ భాస్కర్ మార్క్ కనిపించింది. ఫస్ట్‌హాఫ్ నవ్వులతో… ప్రేమ సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో లవ్ ఎమోషన్, ఫ్యామిలీ డ్రామాతో ఆసక్తికరంగా అనిపించింది.
విజయ్‌భాస్కర్ తరహా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు కోరుకునే వాళ్లకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. చాలా కాలం తరువానువ్వే కావాలి, మన్మథుడు, నువ్వు నాకు నచ్చవ్, మల్లీశ్వరీ లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కె.విజయభాస్కర్ చాలా కాలం విరామం తరువాత తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా, తాన్వీ ఆకాంక్ష హీరోయిన్గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని విజయ భాస్కర్ తన సొంత నిర్మాణ సంస్థపై నిర్మించాడు. లవ్ఈజ్ బ్యూటీ ఫుల్ అనే ఉపశీర్షికతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లో విడుదలైంది.త ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసిన ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది. హని ఉరాఫ్ హనుమంతుగా శ్రీకమల్ నటన అందర్ని ఆకట్టకుంటుంది. మంచి కామెడీ టైమింగ్ వున్న యంగ్ హీరోగా తన ప్రతిభను చూపించాడు. సినిమాలో అతని పాత్ర చలాకీగా, చురుకుగా కనిపిస్తుంది. నూతన హీరోయిన్ తాన్వీ ఆకాంక్ష తొలిచిత్రమైనా ఎక్కడ తడబడకుండా నటించింది. స్క్రీన్‌పై అందంగా కనిపించింది. తెలుగమ్మాయి అయిన తాన్వీకి హీరోయిన్ మంచి భవిష్యత్తు కనిపిస్తుంది.
రాజేంద్రప్రసాద్ తరువాత కామెడీ కథానాయకులు తెలుగు తెరకు కొరవడిన తరుణంలో కామెడీ హీరోలుగా పేరు తెచ్చుకుంటున్న అల్లరి నరేష్, నవీన్ పొలిశెట్టి, తరువాత శ్రీకమల్ ఒక చాయిస్‌లా ఈ సినిమా చూసిన వారికి అనిపిస్తుంది. ఆర్.ఆర్.ధ్రువన్ అందించిన పాటలు చాలా వినసొంపుగా వున్నాయి. వాటికి అందంగా పిక్చరైజ్ చేశారు. సతీష్ ముత్యాల ఫోటోగ్రఫీ సినిమా కథ మూడ్‌కు తగ్గట్టుగా కూల్‌గా వుంది. అలీ, మిర్చికిరణ్ల కామెడీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఓవరాల్‌గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలను ఎంజాయ్ చేసే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. చాలా రోజుల తరువాత ఈ సినిమాలో కనిపించిన క్యూట్ లవ్‌స్టోరీ కూడా అందర్ని కట్టిపడేస్తుంది. ఎలాంటి అంచనాలు లేకుండా సరదాగా కాసేపు నవ్వుకుందామనుకుంటే ఈ వీకెండ్‌కు విజయభాస్కర్ ఉషా పరిణయం మంచి ఛాయిసే.
Also Read..