Urvashi Rautela : బాలీవుడ్ నటి ఉర్వశి రౌతెలా(Urvashi Rautela) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆదివారం 30వ పుట్టిన రోజు వేడుక చేసుకున్న ఆమె వెరైటీగా బంగారు కేకు(Golden Cake) కోసింది. అవును.. ఆ కేకు తయారీలో స్వచ్చమైన 24 క్యారట్ల బంగారం ఉపయోగించారు. ఇంతకు ఆ కేకు ఖరీదు ఎంతో తెలుసా..? అక్షరాల 3 కోట్ల రూపాయలు. ఊర్వశి బర్త్ డే సందర్భంగా ర్యాపర్ యోయో హనీ సింగ్(Yo Yo Honey Singh) ఆ కేకును తెప్పించాడు.
‘ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ అయిన ఆమెకు రాజ మర్యాదలు చేయాల్సిందే. అందుకనే రూ. 3 కోట్ల విలువైన కేకు ఆమెతో కోయించాను. పూర్తిగా బంగారంతో తయారు చేసిన కేకును తీసుకొచ్చాను’ అని హనీ సింగ్ తెలిపాడు. తన బర్త్ డే సెలబ్రేషన్ ఫొటోలను ఊర్వశి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎర్రని డ్రెస్‌లో ఊర్శశి కేకు కట్ చేస్తున్న ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి.
మోడల్, నటి అయిన ఊర్వశి బాలీవుడ్ క్రేజీ హీరోయిన్లలో ఒకరు. హేట్ స్టోరీ 4, గ్రేట్ గ్రాండ్ మస్తీ వంటి సినిమాలతో హిందీలో పాపులర్ అయిన అమె.. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటించిన వాల్తేర్ ‘వీరయ్య సినిమా’లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అనంతరం రాహ్ హీరోగా నటించిన స్కంద(Scanda) సినిమాలోనూ మెరిసింది.