Uruku Patela Movie | ‘హుషారు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యువ కథానాయకుడు తేజాస్ కంచర్ల. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ‘ఉరుకు పటేలా’. గెట్ ఉరికిఫైడ్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాకు వివేక్‌రెడ్డి దర్శకత్వం వహించగా.. కంచర్ల బాలభాను నిర్మించాడు. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబరు 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతా రాణించలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌తో ఒక పల్లెటూరిలో తీసిన థ్రిల్లర్ కామెడీ మూవీ ఇది. ప్రేమించిన అమ్మాయి తన ప్రియుడి కుటుంబాన్ని.. అతడిని ఎందుకు చంపాలనుకుంటుంది అనేది స్టోరీ. ఈ సినిమాలో ఖుష్బూ చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, నిర్మాణం: లీడ్ ఎడ్జ్ పిక్చర్స్.
#UrukuPatela Streaming now on @PrimeVideoIN ❤️🔥#GetUrikified pic.twitter.com/zVR65AiLph
— Moviedeed (@moviedeed) October 20, 2024