Baa Baa Black Sheep | యానిమల్ సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ తెచ్చుకున్నాడు మరాఠి యాక్టర్ ఉపేంద్ర లిమాయే. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశాడు. ఇప్పుడు బా బా బ్లాక్‌షీప్ టీంతో వినోదాన్ని పంచేందుకు రెడీ అవుతున్నాడు. క్రైం కామెడీ జోనర్లో ఎంటర్టైన్ చేసేందుకు వస్తోంది బా బా బ్లాక్‌షీప్ (Baa Baa Black Sheep). గుణి మంచికంటి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్‌ను శర్వానంద్ లాంచ్ చేశాడు.
టీజర్ ప్రారంభంలో అక్షయ్ ఈవెంట్లో చెఫ్ లుక్‌లో కనిపించగా.. ఆ తర్వాత విష్ణు ఎంట్రీ ఇస్తాడు. ఈవెనింగ్ సర్ప్రైజ్ మామ అని విష్ణుతో చెప్తాడు అక్షయ్. పోలీసులు మన వెంట ఎందుకొస్తున్నారురా.. వాళ్లను కూడా ఇన్వైట్ చేశావా..అని టెన్షన్ పడుతుంటే.. ఉపేంద్ర లిమాయే ఎంట్రీ ఇస్తాడు. జాన్ షెల్లీ హిట్లర్ అనే డాన్ పాత్రలో ఉపేంద్ర లిమాయే క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా ఉండబోతున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. మీరు దొబ్బేసిన బాక్స్ అండ్ గన్ ఎక్కడ…. నా దగ్గర కొట్టేసిన బాక్స్ ఎవరికి అమ్మేశారని అడిగే డైలాగ్స్ తో సాగే టీజర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది.
చెప్పుకోవడానికి ఇది మామూలు కథ కాదు. అండపిండ బ్రహ్మాండాలనే అల్లాడించే కథ అంటూ విడుదల చేసిన టీజర్ సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీలో టిను ఆనంద్, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.
ఆరుగురు వ్యక్తులు.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట, ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఆరుగురు వ్యక్తుల ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఈ క్రమంలో వచ్చే కామెడీ, క్రైం లాంటి అంశాలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగించనున్నట్టు టీజర్ హింట్ ఇచ్చేస్తుంది. ఈ చిత్రాన్ని దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోణెపూడి నిర్మిస్తున్నారు.
చెప్పుకోవడానికి ఇది మామూలు కథ కాదు
అండపిండ బ్రహ్మాండాలనే అల్లాడించే కథThe teaser of #BaaBaaBlackSheep is out, and it’s a stylish crime comedy caper with guns, gold, and a city wide funny hunt involving six individuals. Shot entirely in the picturesque locations of Meghalaya,… pic.twitter.com/CMKymcc8dU
— BA Raju’s Team (@baraju_SuperHit) January 23, 2026