Upasana | ఇటీవల సురేఖ, ఉపాసన కలిసి అత్తమ్మాస్ కిచెన్ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ కి ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తూ, సెలెబ్రిటీలకు వాటిని పంపిస్తూ రివ్యూలు తీసుకుంటున్నారు. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఉపాసన కొత్త ఆవకాయ్ మేకింగ్ వీడియో షేర్ చేసి అందులో చాగంటి ప్రవచనం కూడా యాడ్ చేసింది. ఇందులో సురేఖ, అంజనమ్మలు, రామ్ చరణ్ కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
వీడియాలో అంజనమ్మ, సురేఖ మాట్లాడుకుంటూ కనిపించారు. కొత్త ఆవకాయ్ బాగుంది కానీ కొంచెం పులుపు తక్కువ అయితే బాగుండేది” అంటూ వారు చర్చించుకోవడం, దీనిని ఉపాసన సరదాగా ఇది పెద్ద గొడవే అంటూ రామ్ చరణ్‌కి కంప్లైంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు సురేఖ అందరికీ ప్రేమగా కొత్త ఆవకాయ్‌తో అన్నం ముద్దలు పెట్టడం హైలైట్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు “సో స్వీట్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అత్తమాస్ కిచెన్ బ్రాండ్ స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది. టాలీవుడ్ స్టార్స్‌కు స్పెషల్‌గా ప్రొడక్ట్స్ పంపే ఉపాసన.. వాళ్లు ఇచ్చే టేస్ట్ ఫీడ్‌బ్యాక్‌లను తిరిగి షేర్ చేస్తూ వస్తుంది.
ఇక రామ్ చరణ్ కూడా రివ్యూ ఇచ్చాడు. టేస్ట్ బాగుందని చెప్పుకొచ్చాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే కుమార్తె క్లీంకార బర్త్ డే సందర్భంగా కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఉపాసనతో కలిసి ఫ్యామిలీ వెకేషన్‌కు వెళ్లి వచ్చారు. క్లీంకార పేరుతో హైదరాబాద్ జూ పార్క్‌లో ఉన్న పులిని కూడా చూపించారు. ఈ ఉదయం తిరిగొచ్చిన చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది.
Packing love and tradition from our home and sending it to you all.
At https://t.co/WhQ2JmjsaG , we bring the authentic Teluginti Avakaya that’s not just any other pickle.
It’s a legacy, a memory and an emotion put together.A recipe passed down from generations that will… pic.twitter.com/o0IrMbmyZ6
— Upasana Konidela (@upasanakonidela) June 24, 2025