Game Changer Ram Charan | రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమెషన్స్లో భాగంగా రామ్ చరణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్స్టాపబుల్’ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని ఆహా తాజాగా విడుదల చేసింది.
ఈ ప్రోమోలో రామ్ చరణ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తన కూతురు పుట్టినప్పుడు నేను నాన్న చిరంజీవి, ఉపాసన ఎంత ఎమోషనల్ అయ్యామో చెప్పలేం అంటూ తెలిపాడు. అలాగే రామ్ చరణ్ తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనాదేవి మాకు 2025లో వారసుడు కావాలని షోలో అడగడం. క్లీంకారాని ఎప్పుడు చూపిస్తావు అంటూ బాలయ్య అడగడంతో నాన్న అని పిలిచిన వెంటనే రివీల్ చేస్తాను అంటూ రామ్ చరణ్ చెప్పుకురావడం ఈ వీడియోలో చూడవచ్చు.