ట్రెండ్‌కు భిన్నంగా నవీన ఆలోచనలతో, మానవ వ్యక్తిత్వపు లోతుల్ని ఆవిష్కరిస్తూ సినిమాలు తీస్తుంటారు కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర. ఇప్పటివరకు ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలను పరిశీలిస్తే ఆ విషయం అవగతమవుతుంది. తాజాగా ఆయన ‘యుఐ’ అంటూ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హీరో ఉపేంద్ర పాత్రికేయులతో మాట్లాడుతూ పంచుకున్న విశేషాలు..