Aishwarya Rajinikanth | ఐశ్వర్య ఇంట్లో చోరీ ఇంటి దొంగల పనే.. నిందితుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Aishwarya Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసులో నిందితుల్ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
Aishwarya Rajinikanth | తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth ) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ (Aishwaryaa Rajinikanth) ఇంట్లో భారీ చోరీ జరిగిన విషయం తెలిసిందే. చెన్నై (Chennai)లోని తన నివాసంలో లాకర్ (Locker)లో భద్రపరిచిన సుమారు రూ.నాలుగు లక్షల విలువ గల 60 సవర్ల (60 sovereigns) బంగారు, వజ్రాభరణాలు (gold and diamond jewellery ) చోరీకి గురయ్యాయని ఐశ్వర్య చెన్నై (Chennai) తెయనాంపేట్ (Teynampet Police) పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ మేరకు ఐశ్వర్య నివాసంలో దాదాపు 18 ఏళ్లుగా పని చేస్తున్న ఈశ్వరి(46), మరో మహిళ లక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్‌తో పాటు మరో ముగ్గురు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో చెప్పినట్టు పోలీసులు పేర్కొన్నారు.
అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను కూడా వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
కాగా, 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు ఐశ్వర్య ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత నుంచి బయటకు తీయలేదని పేర్కొంది. తనకు వివాహమైన తర్వాత నుంచి గత 18 ఏళ్లలో సమకూర్చుకున్న ఆభరణాల్లో కొన్ని లేవని గుర్తించి షాకైనట్లు తెలిపింది. ఈ చోరి విషయంలో తన ఇంటి పనివాళ్లైన ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకటేశన్‌తో సహా ముగ్గురిపై అనుమానం వ్యక్తం చేసింది. తరచూ వారు తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లే వారని, లాకర్ తాళాలు కూడా ఎక్కడ ఉన్నాయో వారికి తెలుసని ఫిర్యాదులో పేర్కొంది. సుమారు రూ.నాలుగు లక్షల విలువైన డైమండ్ సెట్స్ (Diamond sets), పురాతన బంగారు ముక్కలు (antique gold pieces), నవరత్న సెట్స్ (Navaratnam sets), గాజులు (bangles) ఇలా సుమారు 60 సవర్ల (60 sovereigns) బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొంది.
Also Read..
Mrunal Thakur | కన్నీరు పెట్టుకున్న సీతారామం బ్యూటీ.. ఏమైందంటే..?
Delhi Man Suicide | వైద్య ఖర్చులు భారం కావడంతో బలవన్మరణానికి పాల్పడిన యువకుడు
Delhi Quake | హిందూకుష్ పర్వతాల్లో భారీ భూకంపం.. ఢిల్లీలో ఊగిపోయిన భవనాలు.. వీడియోలు వైరల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

