Game Changer | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ15గా వస్తోన్న ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ Jaragandi పాటను దీపావళి సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఈ లోపే ఈ సాంగ్ ఆన్లైన్లో లీకైంది.
లీక్స్ జరుగకుండా మేకర్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. ఈ సాంగ్ లీక్‌పై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. లీక్‌పై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్స్ డివిజన్ ఏసీపీ చంద్రభాషా, ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ ప్రసేన్ రెడ్డి, ఎస్ఐ సాయితేజ శ్రీ బృందం భవిష్యత్తులో పైరసీ ఘటనలు జరగకుండా హెచ్చరికలు జారీ చేశారు.
గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ డ్యుయల్ షేడ్స్‌లో కనిపించనున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ చెబుతున్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో రాజోలు భామ అంజలి మరో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ లోడింగ్..
#RamCharan #Gamechanger first single on Dussehra
update soon !
— Rajesh Manne (@rajeshmanne1) October 17, 2023