Tumbbad Movie | కొన్ని సినిమాలను మాటల్లో వర్ణించడానికి పదాలు చాలవు. డిక్షనరి కొనుక్కొని కొత్త కొత్త పదాలను వెతుక్కోవాల్సి ఉంటుంది. అలా మాటల్లో చెప్పలేని సినిమాల్లో ‘తుంబాడ్’ (Tumbbad) ఒకటి. మైథలాజికల్ హారర్ బ్యానర్లో వచ్చిన ఈ మూవీకి రాహి అనిల్ బార్వే, ఆనంద్ గాంధీ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇక 2018లో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్టు కొట్టడమే కాకుండా రూ.13 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవడం, కరోనా రావడంతో ప్రేక్షకుల ఆసక్తి చూపలేదు. అయితే లాక్డౌన్ టైంలో ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా దశ పూర్తిగా మారిపోయింది.
ఈ చిత్రం చూసిన ప్రేక్షకులు ఇంత మంచి సినిమాను థియేటర్లో ఎలా మిస్ అయ్యామంటూ కామెంట్లు పెట్టారు. అయితే తాజాగా ఈ చిత్రం రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హిందీ భాషలో రీ రిలీజ్ అవ్వగా.. రీ రిలీజ్ అయిన సినిమాలలో సరికొత్త రికార్డును సృష్టించింది. సెప్టెంబరు 13న మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తుంబాడ్’ మొదటి వారమే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఫస్ట్ వీకే ఏకంగా రూ. 13 కోట్లు వసూళ్లను సాధించింది. ఇక రెండో వారం రూ.12 కోట్లు మూడో వారం రూ.4 కోట్ల వసూళ్లను రాబట్టి.. మొత్తం ఇప్పటివరకు రూ.35 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక రీ రిలీజ్ అయిన చిత్రాలతో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఈ చిత్రం రికార్డు సాధించింది. దీని తర్వాత స్థానంలో దళపతి విజయ్ నటించిన గిల్లీ చిత్రం ఉంది. ఈ సినిమా రూ. 32 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
#Tumbbad collection:
₹35 Crores+ Gross Collection in Re-Release
₹16 Crores Gross in Initial Run.
The HIGHEST GROSSING RE-RELEASE in India.#movies pic.twitter.com/xrKMSmN1vl— Fire (@firefockers) October 8, 2024