True Lover | ఓటీటీలోకి రాబోతున్న ‘ట్రూ లవర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
True Lover | తమిళ నటుడు కె.మణికందన్ (manikandan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జై భీమ్.. గుడ్‌నైట్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే మణికందన్, తెలుగు నటి గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’.
True Lover | తమిళ నటుడు కె.మణికందన్ (manikandan) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జై భీమ్.. గుడ్‌నైట్ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే మణికందన్, తెలుగు నటి గౌరీ ప్రియ జంటగా నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్’. ఈ సినిమాకు ప్రభురామ్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాను మారుతి తీసుకురాగా ఫిబ్రవరి 10న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ చిత్రం మార్చి 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
#Lover Today Night 12PM Streaming ✅🔥 pic.twitter.com/ijSD7aMPx3
— 𝙒𝙖𝙡𝙩𝙚𝙧 𝙒𝙝𝙞𝙩𝙚 (@SivaDas45) March 26, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అరుణ్ (మణికందన్), దివ్య( గౌరీ ప్రియ) కాలేజీ రోజుల నుంచి ప్రేమలో ఉంటారు. అయితే దివ్య కాలేజ్ పూర్తి కాగానే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటుంది. కానీ అరుణ్ మాత్రం కేఫ్ బిజినెస్ పెట్టాలనే ఆలోచనతో ఖాళీగా ఉంటాడు. అయితే అరుణ్‌కు తన ప్రేమ విషయంలో పోసెసివ్ నెస్ ఎక్కువ. దివ్య ఎప్పుడు తనతోనే మాట్లాడాలి అని, తనతోనే ఉండాలని లేకపోతే గోడవలు పెట్టుకుంటూ అప్పుడప్పుడు అనుమాన పడుతుంటాడు. ఫలితంగా ఇద్దరు తరచూ గొడవపడుతూ విడిపోయి.. మళ్లీ కలిసిపోతుంటారు. అయితే ఒక పెద్ద సంఘటన తర్వాత కొన్నాళ్లు ఈ ఇద్దరి మధ్య మాటలుండవు. మరి తర్వాత వీళ్ళు కలుసుకున్న అనంతరం ఏం జరిగింది. మళ్లీ కలిశారా? విడిపోయారా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

