Trivikram Srinivas | నెక్ట్స్ ఎవరితో గురూజీ?.. త్రివిక్రమ్ సినిమాపై ఇంకా రాని క్లారిటీ
‘గుంటూరుకారం’ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేసేదీ క్లారిటీ రాలేదు. ‘గుంటూరుకారం’ నిర్మాణంలో ఉన్నప్పుడు నెక్ట్స్ సినిమా బన్నీతో అని వార్తలొచ్చాయి.
Trivikram Srinivas | ‘గుంటూరుకారం’ తర్వాత త్రివిక్రమ్ ఎవరితో సినిమా చేసేదీ క్లారిటీ రాలేదు. ‘గుంటూరుకారం’ నిర్మాణంలో ఉన్నప్పుడు నెక్ట్స్ సినిమా బన్నీతో అని వార్తలొచ్చాయి. అయితే షూటింగ్ పూర్తవ్వకపోవడంతో ‘పుష్ప2’ డిసెంబర్ 6కు వాయిదా పడింది. దాంతో త్రివిక్రమ్ కథ మళ్లీ మొదటికొచ్చింది. అంతేకాకుండా ‘పుష్ప‘తో అల్లు అర్జున్ ఇమేజ్ పాన్ఇండియా స్థాయికి చేరుకుంది. దాంతో త్రివిక్రమ్‌ని కూడా ఆ స్థాయి కథనే సిద్ధం చేయమని అల్లు కాంపౌండ్ చెప్పిందట. దానికి గురూజీ కొంత టైమ్ అడిగినట్టు ఇన్సైడ్ టాక్.
ప్రస్తుతం ప్రధమశ్రేణి హీరోలంతా పాన్ ఇండియా స్థాయిలో ఆలోచిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు త్రివిక్రమ్ ఆ స్థాయి కథనే సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి. ఇదిలావుంటే.. రామ్ పోతినేనితో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకుంటున్నారు త్రివిక్రమ్.
ఎందుకంటే నిర్మాత స్రవంతి రవికిశోర్ తీసిన సినిమాలే త్రివిక్రమ్‌ని స్టార్‌ని చేశాయి. దర్శకుడిగా ఆయన తొలి సినిమా కూడా స్రవంతి మూవీసే కావడం గమనార్హం. ఆ రుణం తీర్చుకునేందుకే రవికిశోర్ తమ్ముడి తనయుడైన రామ్ పోతినేని హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నారట త్రివిక్రమ్. బయట టాక్ అయితే ఇలావుంది. మరి త్రివిక్రమ్ అంతరంగం ఎలావుందో.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

