Trisha | దక్షిణాది సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్గా కొనసాగుతోంది త్రిష (Trisha). ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న లియోలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే త్రిష లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ది రోడ్ (The Road). రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ అందించారు మేకర్స్.
ది రోడ్ నుంచి ఓ విధి (Oh Vidhi Promo) అంటూ సాగే పాట ప్రోమోను లాంఛ్ చేశారు. శ్యామ్ సీఎస్ కంపోజ్ చేసిన ఓ విధి సాంగ్‌ను సెప్టెంబర్ 14న విడుదల చేస్తున్నట్టు సిద్ శ్రీరామ్ ప్రోమో ద్వారా తెలియజేశాడు. కార్తీక్ నేత రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. అరుణ్ వసీగరన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో డ్యాన్సింగ్ రోజ్గా పాపులర్ అయిన మాలీవుడ్ నటుడు షబీర్ (Shabeer Kallarakkal) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏఏఏ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.
త్రిష్ మరోవైపు లెజెండరీ దర్శకుడు మణిరత్నం డైరెక్షన్లో కమల్ హాసన్ నటిస్తోన్న KH234 లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు అజిత్ కొత్త ప్రాజెక్ట్ Vidaa Muyarchia లో హీరోయిన్గా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తుండగా.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఓ విధి సాంగ్ ప్రోమో..
#TheRoad first single #OhVidhi out tomorrow🎼https://t.co/qmU0d5lrfU
Starring ~ @trishtrashers 👸
Written & directed by~ @Arunvaseegaran1 🎥
Music ~ @SamCSmusic 🎶
Singer ~ @sidsriram 🎤
Lyrics ~ @iamKarthikNetha ✍️#TheRoadFirstSingle #Trisha@trishtrashers @aaa_cinemaa… pic.twitter.com/SCmunrITkS— 𝐒𝐀𝐌 𝐂 𝐒 (@SamCSmusic) September 13, 2023