Trisha | అందుకే బాలీవుడ్ వద్దనుకున్నా: త్రిష
ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది.
Trisha | ప్రస్తుతం దక్షిణాదిలో లక్కీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ త్రిష పేరునే చెబుతున్నారు. ఇక కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న తరుణంలో ఈ భామ ఒక్కసారిగా తారాపథంలో దూసుకువచ్చింది. ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంతో సక్సెస్ఫుల్ సెకండ్ ఇన్సింగ్స్‌ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో పలు భారీ చిత్రాలున్నాయి. దక్షిణాదిలో అగ్ర నాయికలందరూ ప్రస్తుతం బాలీవుడ్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
హిందీలో కూడా ఈ అమ్మడికి అవకాశాలొస్తున్నాయని చెబుతున్నారు. ఇదే విషయమై త్రిష స్పందిస్తూ “కట్టామిఠా’ (2010) చిత్రంతో హిందీలో అడుగుపెట్టాను. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ సినిమా ఫెయిల్యూర్ వల్లే నాకు బాలీవుడ్లో అవకాశాలు రాలేదని చాలా మంది అనుకున్నారు.
అందులో నిజం లేదు. ఆ సమయంలో నా కుటుంబాన్ని ముంబయికి మార్చడానికి మనసు ఒప్పుకోలేదు. బాలీవుడ్‌కు వెళితే ఇక్కడ చాలా సినిమాలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దక్షిణాదిలో నాకున్న క్రేజ్ దృష్ట్యా బాలీవుడ్ సినిమాలు వొద్దనుకున్నాను’ అని చెప్పింది త్రిష. ప్రస్తుతం ఈ భామ కమల్‌హాసన్ ‘థగ్‌లైఫ్’, చిరంజీవి ‘విశ్వంభర’, అజిత్ ‘విడాముయర్చి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

