Tripti Dimri | ‘సినిమా ఒప్పుకున్న తర్వాత దర్శకుడిపై నమ్మకం పెట్టి ముందుకెళ్లాలి. అప్పుడే కథలోని పాత్రకు కనెక్ట్ కాగలం’ అంటున్నది అందాలభామ త్రిప్తి డిమ్రీ. ఇటీవల తనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. ‘ ‘యానిమల్’ ఆఫర్ రాగానే దర్శకుడు సందీప్‌ని కలిశా. ఆయన నాకు కథ చెప్పలేదు. జోయా పాత్ర గురించే చెప్పారు. ఆ సినిమాకు ముందు నేను చేసినవన్నీ సున్నితమైన, పాజిటివ్ రోల్సే. ‘యానిమల్’లో జోయా పాత్ర వాటికి పూర్తి భిన్నమైనది.
తన మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఫేస్‌లో దయ, సానుభూతి కనిపించాలని సందీప్ చెప్పారు. అది నాకు సవాలుగా అనిపించింది. వెంటనే ఓకే చేశాను. సందీప్‌ని నమ్మి ముందుకెళ్లాను. ఫలితం మీఅందరికీ తెలుసు. చాలామంది ‘యానిమల్’కి స్త్రీ ద్వేష చిత్రంగా ట్యాగ్ ఇస్తున్నారు. నేనైతే ఒప్పుకోను. ‘యానిమల్’ అనేది ఓ క్యారెక్టరైజేషన్. దానిచుట్టూ కథ నడుస్తుంది. ఆ పాత్ర అలాంటి కథనే కోరుకుంటుంది. ప్రేక్షకులు కూడా ఆ క్యారెక్టర్‌కి కనెక్ట్ అయ్యారు కాబట్టే అంత హిట్ అయ్యింది’ అని చెప్పుకొచ్చింది త్రిప్తి డిమ్రి.