Actor Ajith | తమిళ నటుడు అజిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీలో అయిన తమిళంలో అగ్ర నటుడిగా కొనసాగుతున్నాడు. రజనీకాంత్, దళపతి విజయ్ తర్వాత ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉన్న ఎకైక హీరో. అయితే అజిత్‌కు ట్రావెలింగ్ అంటే ఇష్టం అన్న విషయం తెలిసిందే. షూటింగ్‌లు లేనప్పుడు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా బైక్ మీదా రైడ్ చేస్తూ ప్రపంచం అంతా చుట్టి వస్తాడు. అయితే తాజాగా అజిత్ ట్రావెలింగ్కు సంబంధించి ఒక వీడియో విడుదల చేశాడు.
ఈ వీడియోలో తనకు ట్రావెలింగ్‌ను ప్రమోట్‌ను చేయడం చాలా ఇష్టమని తెలిపాడు. ఎందుకంటే.. ప్రయాణం కంటే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇంకోకటి లేదని నా అభిప్రాయం. ఒక కోట్ ఉంది. మతం మరియు కులం అనేవి మీరు జీవితంలో ఎప్పుడు కలవనివారిని కూడా అసహ్యించుకోనేలా చేస్తాయి. ఇది నిజం అని నేను నమ్ముతాను. ఎందుకంటే వారిని కలవకముందే మనం వారు ఎలా ఉంటారో డిసైడ్ చేసేస్తాం. ఇది చాలా తప్పు. మనం ట్రావెలింగ్ చేసి విభిన్న సంస్కృతులను అనుభవించినప్పుడు.. లేదా వివిధ దేశాలలో ఇతర మతాలకు చెందిన వారితో వారితో మాట్లాడినప్పుడు వాళ్లు ఎంటో తెలుస్తుంది. మన ఆలోచన ఎంత తప్పో అప్పుడు అర్థం అవుతుంది. అందుకే ట్రావెలింగ్ చేసి మనకు తెలియని వ్యక్తులను కలవండి. ఆ అనుభవం మనకు జీవితంలో ఉపయోగపడడమే కాకుండా మీరు మంచి వ్యక్తిగా మారడంలో సహాయపడుతుంది అంటూ అజిత్ చెప్పుకోచ్చాడు.
அஜித்தே ❤🔥pic.twitter.com/vPctP7rv71
— Devendran Palanisamy (@devpromoth) October 5, 2024