Raj Tarun | డైలామాలో టాలీవుడ్ యువ హీరో ..నెక్ట్స్ ప్లాన్ ఏంటీ..?
కొన్నిసార్లు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సినిమాలు చేస్తున్నా ఆదరణ తగ్గిపోతుంటుంది. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసినా..బాక్సాపీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పడం చాలా కష్టంగా మారిపోతుంది.
సినీ పరిశ్రమ (Movie Industry)లో హీరోగా నిలదొక్కుకోవాలంటే చాలా పట్టుదల, శ్రమ, కృషి ఉంటే కానీ సాధ్యపడదు. కొన్నిసార్లు ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సినిమాలు చేస్తున్నా ఆదరణ తగ్గిపోతుంటుంది. ఎప్పటికపుడు అప్ డేట్ అవుతూ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా సినిమాలు తీసినా..బాక్సాపీస్ వద్ద ఫలితం ఎలా ఉంటుందనేది చెప్పడం చాలా కష్టంగా మారిపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) యువ హీరో ఒకరు అలాంటి పరిస్థితే ఎదుర్కొంటున్నట్టు ఓ వార్త ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తుంది.
ఇంతకీ ఆ యువ హీరో ఎవరనుకుంటున్నారా..? ఉయ్యాల జంపాలా, కుమారి 21ఎఫ్ తో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ (Raj Tarun). ఈ రెండు సినిమాల తర్వాత రాజ్ తరుణ్ చేసిన సినిమాలు బాక్సాపీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. గోదావరి బ్యాక్ డ్రాప్ లో నటించిన అనుభవించు రాజా (Anubhavinchu Raja)సినిమా కూడా ప్లాప్ టాక్‌ను మూటగట్టుకుంది.
Read Also : R glimpse Video | స్టార్ హీరోతో వర్మ కొత్త సినిమా..గ్లింప్స్ వీడియో అదిరింది
దీంతో రాజ్ తరుణ్ యూటర్న్ తీసుకుని స్టాండప్ కామెడీ నేపథ్యంలో అర్బన్ డ్రామాగా వచ్చిన స్టాండప్ రాహుల్ (Stand Up Rahul) సినిమా చేశాడు. ఈ చిత్రం కూడా ఇటీవలే విడుదలై డీలా పడిపోయింది. అయితే కొంతకాలంగా తాను చేసిన సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలుస్తుండటంతో సినిమా జోనర్స్, కథల ఎంపిక విషయంలో డైలామాలో పడ్డాడట రాజ్ తరుణ్.
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు దశాబ్దం పూర్తయినా ఈ కుర్ర హీరో ఇప్పటికే స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడని ఇపుడు జోరుగా టాక్ నడుస్తోంది. ఎలాగైనా మంచి హిట్టు కొట్టి ఫాంలోకి రావాలని చూస్తున్న రాజ్‌తరుణ్ మరి నెక్ట్స్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Read Also : Godfather Sets | గాడ్ ఫాదర్ షూటింగ్ మూడ్‌లో సల్మాన్ ఖాన్..వీడియో
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

