Daggubati Raana | టాలీవుడ్ నుంచి మరో స్టార్ జంట పేరెంట్స్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మెగా హీరో వరుణ్ తేజ్ – లావణ్య దంపతులు తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించగా.. రీసెంట్గా రామ్ చరణ్ తేజ్ – ఉపాసన దంపతులు రెండో సారి పేరెంట్స్ అవ్వబోతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి ఇటీవలే ఉపాసన సీమంతం కూడా జరిగింది. అయితే ఈ క్లబ్‌లోకి తాజాగా మరో జంట చేరింది. దగ్గుబాటి వారసుడు స్టార్ నటుడు రానా – మిహిక బజాజ్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్లు తెలుగు మీడియాలలో వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఈ విషయం రానా స్పందించాల్సి ఉంది.
రానా, మిహీకా బాజాజ్లది ప్రేమ వివాహం. ముంబైలో ఇంటీరియర్ డిజైనర్‌గా సని చేస్తున్న మిహీకా స్వస్థలం హైదరాబాద్. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు తెలిసినప్పటీకి లాక్డౌన్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రానా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వీరి వివాహం 2020 ఆగస్టు 8న ఘనంగా జరిగింది.