Tollywood Re-relased Movies | ఇటీవల కాలంలో రీ-రిలీజ్‌ల హవా ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్లో కొత్త సినిమాల రేంజ్లో రీ-రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడో ఒకటి అయితే పర్వాలేదు. కానీ ప్రతీ నెలలో ఒకటి, రెండు సినిమాలను రీ-రిలీజ్ చేస్తూ చిరాకు తెప్పిస్తున్నారు. పైగా కలెక్షన్లు రాకపోయిన ఫేక్ నెంబర్స్ చెప్పి మరీ అభిమానులకు మధ్య గొడవలు పెడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యన రీజన్ లేకుండా హీరోల ఇమేజ్ను క్యాష్ చేసుకుని ఫ్లాప్ సినిమాలను కూడా రీ-రిలీజ్ చేస్తున్నారు. దాంతో హీరో ఇమేజ్ తగ్గించడమే తప్ప ఒరిగేది లేదు. హిట్టు సినిమాలనే పట్టించుకోని ప్రేక్షకులు.. ఫ్లాప్ సినిమాలను ఎలా పట్టించుకుంటారు అని కొంచెమైనా ఆలోచించకుండా సినిమాలను రీ-రిలీజ్లు చేస్తున్నారు. ఇక పోకిరి సినిమాతో స్టార్ట్ అయిన ఈ రీ-రిలీజ్‌ల ట్రెండ్ ఖుషీ వరకు చేరింది.
మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజైన ‘పోకిరి’ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. పైగా అది అప్పట్లో టాలీవుడ్ గేమ్ చేంజర్. అదీ కాకుండా ఒక హీరో బర్త్‌డేకు ఇలా పెద్ద ఎత్తులో ఒక సినిమా రీ-రిలీజ్ అవడం అదే తొలిసారి. దాంతో ఈ సినిమాకు పర్వాలేదనిపించే కలెక్షన్లు వచ్చాయి. అదే ఊపులో పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘జల్సా’ సినిమాను రీ-రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. అదే రోజున కొన్ని ఏరియాలలో ‘తమ్ముడు’ రిలీజైంది. కానీ ఈ సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు.
ఆ తర్వాత సీనియర్ హీరోలైన చిరు బర్త్‌డే సందర్భంగా ‘ఘరానా మొగుడు’, బాలకృష్ణ ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలు రీ-రిలీజై తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ రెంటుకు సరిపడ కలెక్షన్లు కూడా సాధించలేకపోయాయి. అయితే చెన్న కేశవ రెడ్డి యూ.ఎస్‌లో మంచి కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజైన ‘వర్షం’, ‘బిల్లా’ సినిమాలు పర్వాలేదనిపించే కలెక్షన్లతో సరిపెట్టుకున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకెత్తయితే ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలిన ‘రెబల్’ మూవీని కూడా రీ-రిలీజ్ చేసి మరోసారి చేతులు కాల్చుకున్నారు.
అసలు కారణం లేకుండా రిలీజైన ధనుష్ ‘3’ మూవీ రీ-రిలీజ్లోనూ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘నువ్వే నువ్వే’ రీ-రిలీజై పర్వాలేదనిపించింది. అందరి స్టార్ హీరోల సినిమాలు రిలీజవుతున్నాయి. కానీ తారక్ సినిమా రిలీజ్ కావడంలేదని అభిమానుల కోరిక మేరకు రీ-రీలీజైన ‘బాద్షా’ మొదటి షో నుండే తుస్సుమంది. వెంకీ బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజైన ‘నారప్ప’ పట్టుమని పది లక్షలు కూడా రాబట్టలేకపోయింది. ఇక ఇటీవలే కల్ట్ క్లాసిక్ ‘ప్రేమదేశం’ రీ-రీలీజై పోస్టర్ ఖర్చులను కూడా తీసుకరాలేకపోయింది. చాలా కాలం తర్వాత మళ్లీ ‘ఖుషీ’ రీ-రిలీజ్‌కు మంచి కలెక్షన్లు వచ్చాయి. రానున్న శుక్రవారం మహేష్ ‘ఒక్కడు’ మూవీ రీ-రిలీజ్ కానుంది. మరీ ఈ సినిమా ఖుషీ కలెక్షన్లను బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.
తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా ‘బాబా’, ‘శివాజీ’ సినిమాలను రీ-రిలీజ్ చేశారు. ఇందులో శివాజీ అటకెక్కగా, బాబా పర్వాలేనిపించింది. దళపతి విజయ్ ఇండస్ట్రీకి వచ్చి 30ఏళ్లు అయినందున ‘మెర్సల్’ సినిమాను తమిళంలో ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సినిమా థియేటర్ రెంటుకు సరిపడా కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. వీటిన్నిటిని గమినిస్తే రెండు, మూడు సినిమాలు తప్పితే మిగితావన్ని కూడా కనీస స్థాయిలో కలెక్షన్లు సాధించలేకపోయాయి. ఇకనైనా రీ-రిలీజ్‌లను ఆపేస్తారో లేదో చూడాలి.
Read Also:
Project-k Movie | వీల్ వీడియోతో ప్రాజెక్ట్-K సంచలనం.. నైజాం నుండి కోట్లలో ఆఫర్..!
Dhamaka Movie | రాజమౌళి తర్వాత రవితేజనే.. ధమాకాతో మాస్ మహరాజా సరికొత్త రికార్డు
Shakunthalam | శాకుంతలం రిలీజ్ డేట్‌పై సమంత అభిమానులు అసంతృప్తి.. దిల్‌రాజు ఇలా చేశాడేంటి..!
Vaishnav Tej | వారం గ్యాప్‌లో మెగా మేనళ్లుల పోటీ.. వైష్ణవ్‌తేజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్