రుత్విక్, ఇక్రా ఇద్రిసి జంటగా రూపొందిన చిత్రం ‘వైభవం’. సాత్విక్ దర్శకుడు. నూతన నిర్మాణ సంస్థ రమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై సినిమా రూపొందింది. సెన్సార్ క్లీన్ యూ సర్టిఫికెట్ను పొందిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది.
ఎంతో మంది ప్రతిభావంతులైన నటీనటుల్ని ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నామని, అద్భుతమైన కథ, కథనాలతో సినిమా ఉంటుందని, అందరికీ నచ్చే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతున్నారు.