Tollywood | ఎంత పెద్ద స్టారో హీరో సినిమా అయిన కథ బాగుంటేనే ఆ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తుందని మరోసారి నిరూపితం అయింది. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి కంటెంట్ బేస్డ్ సినిమా విజయం సాధించింది. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచిన ఈ సమయంలో, చిన్న చిత్రంగా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ అద్భుతమైన ఓపెనింగ్స్‌తో ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అమెరికాలో విడుదలైన మొదటి రోజే లిటిల్ హార్ట్స్ చిత్రం $115K గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఇది అదే రోజు విడుదలైన పలు స్టార్ సినిమాలపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపించిందిజ
అమెరికా బాక్సాఫీస్ లెక్కల ప్రకారం చూస్తే.. లిటిల్ హార్ట్స్ సినిమా మొదటి రోజుకి 115K డాలర్లు రాబట్టింది. ఇది స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ($114K), హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో వచ్చిన వార్ 2 ($104K) కలెక్షన్లను కూడా దాటడం విశేషం. ఇక అనుష్క శెట్టి నటించిన ఘాటీ మాత్రం మొదటి రోజుకి 27K డాలర్ల వద్దే ఆగిపోయింది. ఒక చిన్న సినిమా ఓపెనింగ్స్ ఈ స్థాయిలో సెన్సేషన్ సృష్టించడమంటే, ప్రేక్షకుల మద్దతు ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. వార్ 2, హరిహర వీరమల్లు, ఘాటీ వంటి భారీ సినిమాలు ఆశించిన రీతిలో రాణించలేకపోయాయి. కాని, లిటిల్ హార్ట్స్ వంటి చిన్న సినిమా పాజిటివ్ టాక్‌తో ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. కంటెంట్ ఉన్న సినిమాలకి ప్రేక్షకులు ఆదరణ చూపుతారనేది మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది.
ఒకవేళ కథ బలంగా ఉంటే, స్టార్ కాస్టింగ్ లేకపోయినా సినిమా కమర్షియల్ విజయం సాధించగలదని ఈ చిత్రం ఋజువు చేసింది. ప్రారంభం నుంచి లిమిటెడ్ స్క్రీన్స్‌లో రిలీజ్ అయినా, పాజిటివ్ టాక్‌తో పాటు మౌత్ పబ్లిసిటీ బాగా వర్కౌట్ కావడంతో, రెండో రోజు నుంచి స్క్రీన్ల సంఖ్యను పెంచారు. దీంతో కలెక్షన్ల పరంగా మరింత మెరుగైన ట్రెండ్‌ను ప్రదర్శిస్తోంది.ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్‌ను ఇప్పటికే పూర్తి చేసుకుని, క్లీన్ హిట్‌గా నిలిచింది. “ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ము దులిపేస్తుంది. లిటిల్ హార్ట్స్ ఇచ్చిన ఫలితం వాస్తవికంగా ప్రేక్షకుల అభిరుచికి అద్దంపడుతోంది. మార్కెటింగ్ పెద్దగా లేకపోయినా, మంచి కథ, నెగెటివ్ టాక్ లేని సినిమాలు ఏ స్థాయిలో పని చేస్తాయో ఈ సినిమా ప్రూవ్ చేసింది. .