Kajal Aggarwal | ఆ ఫీలింగ్ అస్సలు రానివ్వడు.. భర్త గురించి సీక్రెట్స్ చెప్పిన కాజల్
Kajal Aggarwal | పరిచయం అక్కర్లేని నిండు చందమామ.. అభిమానుల గుండెల్లో స్నేహగీతాలు ఆలపించిన అందాల మిత్రవింద.. కాజల్ అగర్వాల్ కార్వాన్ ముచ్చట్లు..
Kajal Aggarwal | పరిచయం అక్కర్లేని నిండు చందమామ.. అభిమానుల గుండెల్లో స్నేహగీతాలు ఆలపించిన అందాల మిత్రవింద.. టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మగా మరులుగొలుపుతున్న సుందర మూర్తి.. ‘ఖైదీ నెంబర్ 150’లో మెగాబాస్తో స్టెప్పులేసి కెవ్వుమనిపించిన ఇప్పపువ్వు.. ఇప్పుడు నందమూరి నటసింహంతో జతకట్టింది. త్వరలో విడుదల కానున్న బాలయ్య ‘భగవంత్ కేసరి’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ కార్వాన్ ముచ్చట్లు..
కల్యాణ్ రామ్‌తో మొదలైన నా సినిమా ప్రయాణం విజయ్, చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు, బాలకృష్ణ.. ఇలా పెద్ద పెద్ద స్టార్లతో కొనసాగుతున్నది. కలిసి పనిచేసిన ప్రతి హీరో దగ్గరా ఒక మంచి విషయం నేర్చుకున్నా. ఇండస్ట్రీలో సమంత, తమన్నాతో క్లోజ్‌గా ఉంటాను. చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. మా ‘కాజూ’ మినహా ఏ కుక్కను చూసినా భయమే నాకు.
నా గురించి కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదేమో. పదేండ్ల క్రితమే తెలుగు ప్రేక్షకులకు బంధువు, ఆత్మబంధువు అయిపోయాను. మాది ముంబై. మాస్ మీడియాలో డిగ్రీ చేశాను. ఎంబీయే చేద్దాం అనుకునే క్రమంలో మోడలింగ్ అవకాశం వచ్చింది. సినిమాలు తలుపు తట్టాయి. ఇంకేముంది.. చదువులకు బ్రేక్.
నాన్న వినయ్ అగర్వాల్ టెక్స్టైల్ వ్యాపారి. అమ్మ సుమన్ అగర్వాల్‌కు కన్ఫెక్షనరీ బిజినెస్ ఉంది. నా సినిమా వ్యవహారాలన్నీ అమ్మనే చూసుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే అమ్మ నుంచి నేను చాలా నేర్చుకున్నా. అమ్మే నా మెంటర్.
మా ఆయన గౌతమ్ నన్ను చిన్నపిల్లలా చూసుకుంటారు. పెళ్లి వల్ల అమ్మానాన్నలకు దూరంఅయ్యాననే ఫీలింగ్ రానివ్వడు. బాబు నైల్ గురించి, వాడి అల్లరి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. వాడు మా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది అవుతున్నది. నైల్ నాకిచ్చిన మాతృత్వపు అనుభూతిని మాటల్లో చెప్పలేను.
జీన్స్, టీషర్ట్ ఇష్టం. సందర్భాన్ని బట్టి చీర కట్టుకుంటా. మనం వేసుకునే డ్రెస్ మనకు కంఫర్ట్‌గా ఉండాలి. ఎవరి మెప్పు కోసమో ఖరీదైన దుస్తులు వేసుకోవడం నాకు నచ్చదు. ఫుడ్ విషయానికొస్తే.. ఆసియా వంటకాలన్నీ ఇష్టమే. థాయ్, జపనీస్, వియత్నమీస్ బాగా ఎంజాయ్ చేస్తా. తీపి వంటకాలు కనిపిస్తే దాడి చేస్తాను. చాక్లెట్ చిప్ ఫ్లేవర్ ఐస్‌క్రీమ్ ఇష్టం.
టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మ ఉన్న దక్షిణాది హీరోయిన్ నేనే. అందుకు ఒకింత గర్వంగానే ఉన్నా.. అది నా బాధ్యతను పెంచింది కూడా. ఆ గౌరవాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తా. నటిగా, కూతురిగా, భార్యగా, తల్లిగా.. ఒక మహిళ చాలా పాత్రలు పోషించాల్సి వస్తుంది. నా విషయానికొస్తే సినిమాలతో పాటు నిజ జీవితంలోని ప్రతి పాత్రకూ న్యాయం చేశాననే అనుకుంటున్నాను.
Read More :
“Kajal Aggarwal | ఆ విషయంలో బాలీవుడ్ వెనుకబడింది.. తన అనుభవాన్ని చెప్పుకొచ్చిన కాజల్”
“Kajal Aggarwal | సినిమాలకు కాజల్ గుడ్‌బై.. మళ్లీ తల్లి కాబోతుందా?”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

