Kajal Aggarwal | క్రమశిక్షణ, నైతిక విలువలు, వృత్తిపరమైన నిబద్ధత దక్షిణాది చిత్ర పరిశ్రమను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని అంటున్నది నాయిక కాజల్ అగర్వాల్. ఈ నైతిక విలువలు బాలీవుడ్లో లోపించాయని ఆమె అభిప్రాయపడింది.
ఇటీవల ఓ జాతీయ సదస్సులో పాల్గొన్న కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ..‘నేను ముంబై అమ్మాయిని. హిందీ సినిమాల్లో నటించినా..దక్షిణాది చిత్ర పరిశ్రమ నన్ను ఆదరించింది. తెలుగు, తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించి స్టార్‌గా పేరు తెచ్చుకున్నాను. హైదరాబాద్, చెన్నై నగరాలను సొంతూరిలా భావిస్తా. దక్షిణాది చిత్ర పరిశ్రమ వైవిధ్యమైన కథలతో దేశీయంగా బాక్సాఫీస్ వద్ద పైచేయి సాధిస్తున్నది. ఇక్కడ ప్రతిభ గల వారు ఎంతోమంది ఉన్నారు. పని పట్ల వారి నిబద్ధత, క్రమశిక్షణ, నైతిక విలువలు విజయాలను అందిస్తున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ వెనకబడింది. వారిలో నైతిక విలువలు లోపించాయి. ఫ్రెండ్లీగా అని చెప్పింది. 2004లో ‘క్యోం హోగయ నా’ చిత్రంతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన కాజల్…‘చందమామ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. పలు హిట్ చిత్రాలతో అగ్ర నాయికగా ఎదిగింది.