Kalyandev| మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ మరో సినిమా
'విజేత' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో కళ్యాణ్ దేవ్ (Kalyandev). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అల్లుడుగా టాలీవుడ్ (Tollywood)కు వచ్చాడు అప్పుడే మరో సినిమా మొదలు పెట్టాడు కళ్యాణ్ దేవ్.

‘విజేత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో కళ్యాణ్ దేవ్ (Kalyandev). మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)అల్లుడుగా టాలీవుడ్ (Tollywood)కు వచ్చాడు ఈయన. తొలి సినిమా విజయం సాధించకపోయినా కూడా నటుడిగా కళ్యాణ్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాలేదు కళ్యాణ్ దేవ్. సూపర్ మచ్చి అనే ఒక సినిమా చేసాడు కానీ ఇప్పటివరకు అది విడుదల కాలేదు. కరోనా కారణంగా ఇంకా బాక్స్ లోనే ఉండిపోయింది సూపర్ మచ్చి. దీంతో పాటు కిన్నెరసాని అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది.
ఈ మధ్య విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలు కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు. ఇదిలా ఉంటే అప్పుడే మరో సినిమా మొదలు పెట్టాడు కళ్యాణ్ దేవ్. MP ఆర్ట్స్ బ్యానర్ లో మోనిష్ పత్తిపాటి నిర్మాతగా ఎం కుమారస్వామి నాయుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది.
అక్టోబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. YS కృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గౌతి హరినాథ్ నిర్మాణ నిర్వహణ చూసుకుంటున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. ఒక సినిమా అనుభవంతో వరుస సినిమాలు చేస్తున్నాడు మెగా అల్లుడు. మరి వీటిలో ఈయన కోరుకునే విజయం ఏది తీసుకొస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sunny Leone | బీచ్ లో బీరు పొంగించిన సన్నీలియోన్..వీడియో వైరల్
Tollywood Drug case | ఎవరు ఏ తేదీన ఈడీ ముందు హాజరు కానున్నారు..?
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

