Chiranjeevi | ఆ మూడు పండగలకు చిరంజీవి నెక్ట్స్ మూడు చిత్రాలు!
Chiranjeevi Upcoming Movies Release Dates | మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతంలో ఎన్నడూ లేనంత స్పీడ్‌గా కథలను ఓకే చేస్తూ సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఈయన సహ నటులు ఒకటి రెండు సినిమాలను లైన్లో పెడితే ఈయన మాత్రం నాలుగైదు సినిమాలను లైన్లో పెడుతున్నాడు. అప్పట్లో చిరంజీవికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో, ఇప్పుడు కూడా అంతే ఉంది. ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవలే చిరు ‘ఆచార్య’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ప్రేక్షకులనే కాదు మెగా ఆభిమానులను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఈ క్రమంలో చిరంజీవి తన తదుపరి చిత్రాలపై పూర్తి దృష్టిని పెట్టాడు.
చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాల షూటింగ్‌లను ఏకకాలంలో జరుపుతున్నాడు. అందులో ‘గాడ్‌ఫాదర్’ ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే డేట్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. నయనతార, సత్యదేవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్‌రోల్‌లో నటిస్తున్నాడు.
ఇక బాబీ దర్శకత్వంలో చిరంజీవి 154వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరు అండర్‌కవర్ కాప్‌గా కనిపించనున్నాడు. విశాఖపట్నం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మాస్రాజ రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.
వీటితో పాటుగా చిరు, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను చేస్తున్నాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్, చిరంజీవి సోదరిగా నటిస్తుంది. రాఖిపండగ సందర్భంగా విడుదలైన చిరు, కీర్తి పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 2న విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దీన్నిబట్టి చూస్తే చిరు మూడు పండగలకు మూడు సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నట్లే. ఈ మూడు సినిమాల విడుదల తేదీలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

