Tollywood | 2025 నవంబర్ నెల టాలీవుడ్ బాక్సాఫీస్‌కి పెద్దగా కలిసిరాలేదు. పెద్ద సినిమాలు, స్టార్ హీరోల రీ-రిలీజ్లు, మధ్యస్థాయి సినిమాలు, చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. మొత్తం నెలలో హిట్ టాక్ తెచ్చుకున్న ఒకే ఒక్క సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి’ మాత్రమే. ముందుగా అక్టోబర్ 31న రీ-రిలీజ్ అయిన ‘బాహుబలి ది ఎపిక్’ తో పాటు, రవితేజ 75వ సినిమా ‘మాస్ జాతర’ తో నవంబర్ మొదలయ్యింది. బాహుబలి రీ-రిలీజ్‌కు ₹100 కోట్లు దాటుతుందని భారీ అంచనాలు ఉండగా, కలెక్షన్లు ₹50 కోట్ల వద్దే ఆగిపోయాయి. రవితేజ ‘మాస్ జాతర’ మరో డిజాస్టర్‌గా రవితేజ ఖాతాలో చేరింది.
ఇక నవంబర్ 7న వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలోసుధీర్ బాబు ‘జటాధర’, రష్మిక మంధాన ‘ది గర్ల్‌ఫ్రెండ్’, తిరువీర్ ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’, సాత్విక్ వర్మ ‘ప్రేమిస్తున్నా’ రిలీజ్ కాగా వాటిలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందాయి. కానీ థియేటర్లలో మాత్రం ఎక్స్పెక్టెడ్ రేంజ్లో కాసులు రాలేదు.ఇక ‘జిగ్రీస్’, ‘లవ్ OTP’, ‘సంతాప ప్రాప్తిరస్తు’ వంటి చిన్న సినిమాలు నవంబర్ 14న రిలీజ్ అయ్యాయి. ప్రేక్షకులు పట్టించుకోకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఏదీ నిలబడలేదు. ఇక మూడో వారం వచ్చిన సినిమాలు చూస్తే.. అల్లరి నరేష్ ‘12A రైల్వే కాలనీ’, ‘ఇట్లు మీ ఎదవ’, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘పాంచ్ మినార్’, ‘ప్రేమంటే’.
ఈ చిత్రాలలో క్లీన్ హిట్‌గా నిలిచిన ఏకైక చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. చిన్న చిత్రంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ లాభాల బాటలో ఉంది. మరోవైపు నవంబర్ 28 రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాగా, ఆ చిత్రానికి జిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ కలెక్షన్లు మాత్రం పెద్దగా రాలేదు. మొత్తానికి 2025 నవంబర్ నెలలో టాలీవుడ్ లో వచ్చిన ఒకే ఒక్క కమర్షియల్. ‘రాజు వెడ్స్ రాంబాయి’. మిగతా సినిమాలు విమర్శకుల ప్రశంసలు తెచ్చుకున్నాయి కానీ కలెక్షన్లు లేవు. దీంతో డిసెంబర్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2: థాండవం’ సహా పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రాబోతుండటంతో, డిసెంబర్ బాక్సాఫీస్ మీద అంచనాలు భారీగా పెరిగాయి.