Nusrat Jahan @ Pathan | పఠాన్‌కు మద్దతుగా నిలిచిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్
Nusrat Jahan @ Pathan | పఠాన్ సినిమాకు టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్ అండగా నిలిచారు. ఈ సినిమాలో దీపిక చాలా అందంగా ఉన్నదని కితాబునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన జీవితాలను అదుపు చేయాలని ప్రయత్నిస్తున్నదని నుస్రత్ ఆరోపించారు.
Nusrat Jahan @ Pathan | బేషరమ్ రంగ్ పాటపై మొదలైన వివాదం రాజకీయ కోణం సంతరించుకున్నది. పఠాన్ సినిమాను నిషేధించాలంటూ ఆరు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పఠాన్‌కు మద్దతుగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.
షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమాలో బేషరమ్ రంగ్ పాట వివాదాస్పదంగా మారింది. ఈ పాటను సినిమా నుంచి తొలగించాలంటూ వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి ఎంపీ నుస్రత్ జహాన్ అండగా నిలిచారు. ‘ఏ రాజకీయ పార్టీకి ఏ రంగుపైనా గుత్తాధిపత్యం లేదని నేను భావిస్తున్నాను. బేషరమ్ రంగ్ పాటలో దీపిక చాలా అందంగా ఉన్నది. ఈ సినిమా నచ్చుతుందో లేదో ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. ఆడవాళ్లకు ప్రతిదానిలో సమస్యలు వస్తున్నాయని, హిజబ్, బికినీలు ధరించడం వల్ల సమస్యలు వచ్చాయని గుర్తుచేశారు. ఇవాల్టి భారతీయ మహిళలు ఏం ధరించాలో ఈ సమాజం చెప్తుందా? అంటూ నుస్రత్ జహాన్ ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం మా జీవితాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. మనం ఏం ధరించాలి.. ఏం తినాలి.. ఎలా మాట్లాడాలి.. ఎలా నడవాలి.. స్కూల్లో ఏం నేర్పించాలి.. టీవీల్లో ఏం చూడాలి అనే విషయాలను అధికార పార్టీ నిర్ణయించాలని చూస్తున్నదని విమర్శించారు. ఈ విషయాల గురించి ఆలోచిస్తూ భయపడుతున్నానని చెప్పిన ఎంపీ నుస్రత్ జహాన్.. ఇది ఇలాగే కొనసాగితే మనం ఎక్కడికి వెళ్తామో అని విచారం వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

