టిక్ టాక్ నుంచి హీరోయిన్లుగా మారుతున్న తెలుగమ్మాయిలు
టిక్‌టాక్ నుంచి వచ్చిన దీపిక పిల్లి.. ప్రస్తుతం రష్మిగౌతమ్తో స్టేజ్ షేర్ చేసుకుంటుంది. ఢీ 13లో రష్మితో కలిసి టీం లీడర్‌గా మారిపోయి.. గుర్తింపు తెచ్చుకుంటుంది.

టిక్‌టాక్‌తో చాలామంది టాలెంట్ బయటకొచ్చింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోకి రావాలనుకునే తెలుగమ్మాయిలకు టిక్‌టాక్ చాలా మంచి ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. వీరిలో కొందరు ఇండస్ట్రీలోకి కూడా వచ్చేశారు. రావడమే కాదు తమకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా సంపాదించుకుంటున్నారు. బన్నీ వాక్స్ ఉరఫ్ వర్షిణి అయితే సినిమాలతో బిజీ అవుతుంది. ఈమె చేతిలో ఇప్పుడు మూడు సినిమాల వరకూ ఉన్నాయి.

టిక్‌టాక్‌తో ఫేమస్ అయిన కొంతమంది తెలుగు అమ్మాయిలు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పిచ్చెక్కిస్తున్నారు. టిక్‌టాక్‌తో ఫేమస్ అవ్వడమే కాకుండా సినిమాలు, టీవీ షోల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. టిక్‌టాక్ నుంచి వచ్చిన దీపిక పిల్లి.. ప్రస్తుతం రష్మిగౌతమ్తో స్టేజ్ షేర్ చేసుకుంటుంది. ఢీ 13లో రష్మితో కలిసి టీం లీడర్‌గా మారిపోయి.. గుర్తింపు తెచ్చుకుంటుంది దీపిక పిల్లి. మరోవైపు టిక్‌టాక్‌లో తన డ్యాన్సులతో ఆకట్టుకున్న భానుకి కూడా ఈటీవీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. టిక్‌టాక్‌తోనే ఫేమస్ అయిన క్రిస్టియన్ రవళి అనే అమ్మాయి కూడా టీవీ షోలకు వచ్చింది. ఇక్కడ వరుస షోలు చేస్తుంది. ఈమె యూట్యూబ్‌లో పలు ప్రైవేటు సాంగ్స్‌తోనూ ఆకట్టుకుంది.

ఇక బన్నీ వాక్స్ ఉరఫ్ వర్షిణి అయితే ఏకంగా సినిమాల్లో బిజీ అవుతుంది. చూడ్డానికి రాశీ ఖన్నాలా ఉంటుంది ఈ అమ్మాయి. ఈమెకు ఇప్పుడు సినిమాల్లో ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. విద్యార్థి అనే సినిమాతో పాటు మరో రెండు మూడు సినిమాలు చేస్తుంది వర్షిణి. వీళ్లందరికీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందరూ టిక్‌టాక్ నుంచి వచ్చిన వాళ్లే. సోషల్ మీడియా నుంచి ఇండస్ట్రీకి నేరుగా బాటలు వేసుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
రాజమౌళి సినిమాకు పని చేసినా పేరు రాదు.. రామ్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్లో నయా ట్రెండ్.. ఫిట్ నెస్ రీల్స్ చుట్టూ తెలుగు స్టార్స్
బిగ్‌బాస్ పేరు మారింది.. టీవీ కంటే ముందు ఓటీటీలో రియాల్టీ షో
పది ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా థియేటర్లోనే లవ్ స్టోరీ..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telugu University | ఏపీ ఎమ్మెల్యేకు తెలంగాణ పురస్కారం..! వివాదాస్పదంగా మారిన తెలుగు యూనివర్సిటీ నిర్ణయం
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

