టాలీవుడ్లో నయా ట్రెండ్.. ఫిట్ నెస్ రీల్స్ చుట్టూ తెలుగు స్టార్స్
ప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నయా ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫిట్నెస్ రీల్స్ ! ఇన్‌స్టా రీల్స్ చాలా రోజులుగా చేస్తూనే ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అంతా ఇన్‌స్టా రీల్స్ పైనే పడ్డారు.

తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని ఇండస్ట్రీలలో కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్స్ మారిపోతుంటాయి.. కొత్తవి మొదలవుతుంటాయి. వాటిని ఎవరో ఒకరు కొత్తగా పరిచయం చేస్తూనే ఉంటారు. అలా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నయా ట్రెండ్ ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫిట్నెస్ రీల్స్ ! ఇన్‌స్టా రీల్స్ చాలా రోజులుగా చేస్తూనే ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అంతా ఇన్‌స్టా రీల్స్ పైనే పడ్డారు. ఇప్పుడు వాటినే కాస్త కొత్తగా పరిచయం చేశాడు అల్లు శిరీష్. మన హీరోలకు జిమ్ అంటే ఎంత యిష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కరోనా టైమ్‌లో చాలా మంది ఎక్కువగా జిమ్‌లోనే కాలం గడుపుతున్నారు. అక్కడే ఉండి ఇన్‌స్టా రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. వీటిని అల్లు శిరీష్ మొదటగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇప్పుడు వీటిని అంతా ఫాలో అవుతున్నారు.

కొన్ని రోజుల కింద ఫిట్ నెస్ ట్రైనింగ్ పేరుతో వీడియోలు మొదలు పెట్టాడు అల్లు వారబ్బాయి. అందులో ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తున్నాడు ఈయన. ఫిట్‌గా ఉండటానికి తాము ఎంత కష్టపడుతున్నాం.. ఏం చేస్తున్నామనేది అభిమానుల ముందు పెట్టాడు శిరీష్. తమ హార్డ్ వర్క్ వీడియోల రూపంలో షూట్ చేసి.. వాటికి తగ్గట్లుగా సౌండ్ యాడ్ చేయించి తమ ఇన్ స్టాలో రీల్స్‌గా అప్లోడ్ చేస్తున్నాడు శిరీష్. వీటికి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. ఇప్పుడు అల్లు వారబ్బాయి మొదలు పెట్టిన ఈ ట్రెండ్‌నే మిగిలిన స్టార్స్ ఫాలో అవుతున్నారు. ఈ మధ్యే విజయ్ దేవరకొండ కూడా తన అభిమానుల కోసం లైగర్ ఫిట్నెస్ వీడియోను అప్లోడ్ చేశాడు. ఆ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కూడా తన ఇన్‌స్టా ఫిట్నెస్ రీల్ అప్లోడ్ చేశాడు. గని కోసం బరువు తగ్గి.. మిస్టర్ ఫిట్‌గా రెడీ అయ్యానని వరుణ్ తేజ్ కూడా ఓ స్పెషల్ ఇన్ స్టా ఫిట్నెస్ రీల్లో చూపించాడు.
తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా సైతం ఈ ఫిట్ నెస్ ట్రెండ్ ఫాలో అయిపోయింది. తన నాజుకు నడుము అందాలతో పాటు మెరుపుతీగ లాంటి బాడీని కూడా వీడియో చేసి పోస్ట్ చేసింది. ఒకప్పుడు హాలీవుడ్లో ఈ ఫిట్ నెస్ రీల్స్ ట్రెండ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత అది నెమ్మదిగా బాలీవుడ్ వైపు వచ్చింది. తాజాగా అల్లు శిరీష్ పుణ్యమా అని టాలీవుడ్‌లోనూ బాగానే ట్రెండ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidadala Rajini | ఏపీలో దాడులు, దౌర్జాన్యాలతో జంగిల్ రాజ్ పాలన : మాజీ మంత్రి విడుదల రజిని
Puvvada Ajay | పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి: పువ్వాడ అజయ్ కుమార్
‘బీఈడీలో యోగా సబ్జెక్ట్ భవిష్యత్ టీచర్లకు ఉపయుక్తం’
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
life imprisonment to priest | గుడిలో బాలికల వీడియోలు తీసి విదేశీయులకు విక్రయించిన పూజారి.. జీవిత ఖైదు విధించిన కోర్టు
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

