Ramcharan New Movie | రామ్ చరణ్ కొత్త సినిమా..లైన్లో ముగ్గురు దర్శకులు..?
రాజమౌళి ( SS Rajamouli ) సినిమాకు కమిటైన తర్వాత కచ్చితంగా ఆ హీరో కెరీర్ లో లాంగ్ గ్యాప్ వస్తుంది. ఎంత కాదనుకున్నా కూడా అది కుదరదు. కచ్చితంగా గ్యాప్ రావాల్సిందే అంటాడు జక్కన్న.

రాజమౌళి ( SS Rajamouli ) సినిమాకు కమిటైన తర్వాత కచ్చితంగా ఆ హీరో కెరీర్ లో లాంగ్ గ్యాప్ వస్తుంది. ఎంత కాదనుకున్నా కూడా అది కుదరదు. కచ్చితంగా గ్యాప్ రావాల్సిందే అంటాడు జక్కన్న. పాపం ఆయనెంత స్పీడ్ గా సినిమాలు చేయాలని ప్రయత్నించినా కూడా కనీసం మూడేళ్ళు అయినా పడుతుంది. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. రామ్ చరణ్ ( Ram Charan ), జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ సినిమాను 2017లో అనౌన్స్ చేసి.. 2018లో పట్టాలెక్కించాడు రాజమౌళి. అప్పట్నుంచి షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. మధ్యలో కరోనాతో దాదాపు ఏడాది పోయింది. లేకపోతే ఈ పాటికే సినిమా వచ్చుండేది.
అవన్నీ పక్కనబెడితే ఈ మూడేళ్ళ విరామాన్ని వరుస సినిమాలతో భర్తీ చేయాలని చూస్తున్నాడు రామ్ చరణ్. అందుకే వేగంగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తర్వాత మరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు మెగా వారసుడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఇది ఉండబోతుంది. సెప్టెంబర్ చివరి వారం నుంచే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమా తర్వాత మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు చరణ్. తనకు బాగా కావాల్సిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ సినిమా చేయబోతున్నాడు మెగా పవర్ స్టార్. ఆ బ్యానర్ నిర్మాతలు వంశీ, ప్రమోద్ ఇద్దరూ రామ్ చరణ్ కు చాలా సన్నిహితులు.
చాలా ఏళ్లుగా యూవీ నిర్మాతలు చరణ్ తో సినిమాకు ట్రై చేస్తున్నారు కానీ బిజీగా ఉండటంతో కుదర్లేదు. ఇన్నేళ్ళకు ఈ సమయం వచ్చేలా కనిపిస్తుంది. శంకర్ సినిమా తర్వాత యూవీ బ్యానర్ లోనే చరణ్ సినిమా ఉండబోతుంది. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుములతో పాటు అనిల్ రావిపూడి పేరు కూడా లిస్టులో వినిపిస్తుంది. ఈ ముగ్గురులో ఎవరో ఒకరు రామ్ చరణ్ తో సినిమా చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే వాళ్లెవరు అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి..
Karan Johar Fear| భయపడుతున్న బాలీవుడ్ దర్శకుడు
Sukumar | తండ్రి పేరు మీద స్కూల్ ప్రారంభించిన సుకుమార్
Pooja Hegde Akkineni Akhil | అఖిల్ ను కాపాడేది పూజాహెగ్డే మాత్రమే..?
దోస్తి వీడియో సాంగ్ ఐడియా ఎవరిదో చెప్పిన రాజమౌళి
Vedhika Kumar look | వేదిక స్టన్నింగ్ లుక్కు నెటిజన్లు ఫిదా….వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

