పునీత్ చనిపోయిన విషయం ఆ కుటుంబంలో ఇంకా ఒకరికి తెలియదు
Puneeth Raj Kumar | పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అలాంటిది ఆయన ఇంకా బతికే ఉన్నాడని.. అతడి కుటుంబ సభ్యుల్లో ఒకరు నమ్ముతున్నారు. ఈ రోజుకు కూడా పునీత్ చనిపోయిన విషయాన్ని ఆమెకు చెప్పలేదు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ప్రపంచం మొత్తానికి తెలిసిన చేదు నిజం ఆమెకు మాత్రం ఇంకా తెలియదు. ఆమె పునీత్ రాజ్ కుమార్ కుటుంబంలోనే ఒకరు.. ఇంకా ఆయన బతికే ఉన్నాడు అని భ్రమలో బతుకుతున్నారు.
దివంగత పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్‌ను మరోసారి అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. దానికి కారణం మార్చి 17 ఆయన జయంతి కావడమే. 2021 అక్టోబర్ 29 ఉదయం 11 గంటలకు ఆయన గుండెపోటుతో మరణించాడు. పునీత్ చనిపోయి 5 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికీ అతడిని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా ఆయన బతికే ఉన్నాడు అని తమకు తాము తీపి అబద్ధాలు చెప్పుకుంటున్నారు అభిమానులు. దానికి తోడు మార్చి 17న ఆయన నటించిన చివరి సినిమా జేమ్స్ విడుదలైంది. ఇది చూసి మరింత ఎమోషనల్ అవుతున్నారు ఫ్యాన్స్. కర్ణాటక వ్యాప్తంగా ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా గతంలో ఏ సినిమాకు లేనంత అడ్వాన్స్ బుకింగ్ జేమ్స్ సినిమా విషయంలో జరిగింది. ఖచ్చితంగా మొదటి రోజు రికార్డులు భారీ తేడాతో బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పునీత్ కుటుంబంలో ఒక వ్యక్తికి ఆయన చనిపోయిన విషయం ఇంకా చెప్పలేదు.
ఆమె ఎవరో కాదు.. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ సొంత చెల్లెలు నాగమ్మ. పునీత్ మేనత్త ఈవిడ. మేనల్లుడు అంటే ఆమెకు ప్రాణం. కేవలం పునీత్ మాత్రమే కాదు రాఘవేంద్ర, శివరాజ్ కుమార్ అంటే కూడా ఆమెకు పంచప్రాణాలు. ఆ మధ్య ఒకసారి పునీత్ రెండో అన్నయ్య రాఘవేంద్రకు హార్ట్ ఎటాక్ వచ్చిందనే విషయం తెలుసుకొని నాగమ్మ కూడా హాస్పిటల్ పాలయ్యింది. అలాంటిది ఇప్పుడు పునీత్ లేడనే విషయం ఆమెకు తెలిస్తే అసలు తట్టుకోలేదు. అందుకే ఆమె ఎప్పుడు అడిగినా కూడా అవుట్ డోర్ షూటింగ్‌కు వెళ్లాడు అని అబద్ధం చెబుతున్నారు కుటుంబ సభ్యులు. 90 ఏళ్ల నాగమ్మ ఆలోచనల్లో ఇప్పటికీ పునీత్ బతికే ఉన్నాడు. ఆయన జయంతి సందర్భంగా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read More :
Chirnajeevi | పునీత్ రాజ్ కుమార్ జేమ్స్ సినిమా పై చిరంజీవి ఎమోషనల్”
Kareena Kapoor pool day | మాల్దీవుల్లో బీటౌన్ భామల సందడి..నెట్టింట స్టిల్స్ హల్చల్
krithi Shetty | కృతిశెట్టికి కోలీవుడ్ నుంచి పిలుపు.. ఆ స్టార్ హీరోతో కలిసి నటించనుందా?
Kriti Sanon | హీరోలతో పాటు హీరోయిన్లకు సమ ప్రాధాన్యత లేదు :కృతి సనన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

