bigg boss 5 | ఈ టైమ్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఏంటి బాసూ.. మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా..?

wild card entry in bigg boss 5 telugu | బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో ఊహించడం కష్టం. అందుకే బిగ్ బాస్ ఇల్లు అంటేనే విచిత్రాలకు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఈ సీజన్ మొదలై అప్పుడే 11 వారాలు కావొస్తుంది. ఈ వారం విశ్వ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన ఎలిమినేషన్ కాస్త అనూహ్యమే. ఎందుకంటే గేమ్ బాగా ఆడుతున్నాడు.. అలాగే ఇంట్లో వర్క్ కూడా అద్భుతంగా చేస్తాడు. అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం అంటే సంచలనమే అవుతుంది. మరో 6 వారాల్లోనే ఈ సీజన్ ముగింపునకు వచ్చేయనుంది. ఇప్పటికే బిగ్ బాస్ 5 తెలుగులో కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని ఊహించారు ప్రేక్షకులు. కానీ అలాంటిదేం జరగలేదు.
ప్రతీసారి ఇంట్లోకి 16 మంది ఇంటి సభ్యులను పంపించి.. రెండు మూడు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ పంపించేవాళ్లు. గత సీజన్లో రెండు వారాల తర్వాత జబర్దస్త్ కమెడియన్ అవినాశ్ వచ్చాడు. అలాగే దానికి ముందు కూడా అలాగే కొందరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే సీజన్ 5లో మాత్రం 10 వారాలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరూ రాలేదు. ముందు పంపించడమే 19మందిని ఇంట్లోకి పంపించారు. దాంతో ఈ సారి వైల్డ్ కార్డ్ ఉండదేమో అనే వాదనలే ఎక్కువగా వినిపించాయి. కానీ బిగ్ బాస్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో చెప్పడం కష్టమని ముందుగానే చెప్పుకున్నాం కదా..!
అందుకే చివరి 5 వారాలకు గానూ ఓ వైల్డ్ కార్డ్ రాబోతున్నారని తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఓ హీరోయిన్ ను వైల్డ్ కార్డ్ ఇచ్చి లోపలికి పంపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే చివరి ఐదు వారాలు వచ్చి ఏం చేస్తుంది.. ఆమె ఎలాగూ గెలవదు కదా.. అలాంటప్పుడు వచ్చి లాభమేంటి.. కచ్చితంగా వచ్చినా కూడా ఆ వారమే ఇంటికి పంపించేస్తారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. గత సీజన్లో స్వాతి దీక్షిత్, సాయి కుమార్ పంపాన లాంటి వాళ్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరి ఈ సారి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg Boss: బిగ్ బాస్ హౌజ్‌లో హీరో ఎవరు, విలన్ ఎవరు?
Vishnu priya | ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ల గుండెలు ఆగిపోతాయి విష్ణు ప్రియ..?
Bigg Boss: రివేంజ్ తీర్చుకునే అవకాశం ఇవ్వడంతో రెచ్చిపోయిన హౌజ్‌మేట్స్
Shanmukh: షణ్ముఖ్‌తో ఓ ఆటాడుతున్న సిరి..అర్ధరాత్రి కన్నీరు పెట్టుకున్న ప్రియాంక
vishnu priya : బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టను, ఎవరికి సపోర్ట్ చేయనన్న హాట్ యాంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

