కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్ గేమ్ ఎంత ఆసక్తికరంగా సాగిందో మనం చూశాం. అయితే గేమ్‌లో క్విట్ అని చెప్పేందుకు గాను విచిత్రమైన డ్రింక్స్ తాగించడం మనం చూశాం. అయితే వాటికి రివేంజ్ తీర్చుకునే అవకాశం కల్పించారు హోస్ట్ నాగార్జున. మొదటిగా రవి గుడ్డు, సోయాసాస్, చిల్లీ సాస్ ఇలా అన్నీ కలిపి షణ్ముక్‌తో తాగించి రీవేంజ్ తీర్చుకునేట్టు చేశారు
అనీ మాస్టర్ ముందుగా కాజల్‌తో మిర్చితినిపించి ఆ తర్వాత మిక్స్ డ్ డ్రింక్ ఇచ్చింది.దానిని కాజల్ గడగడ తాగి షాకిచ్చింది. ఇక శ్రీరామ్.. సన్నీతో తాగించగా, వెంటనే జ్యూస్‌లో ఇంకేవేవో కలపడానికి ప్రయత్నించగా మొగడా ఆగరా అంటూ విసుక్కుంటూనే మొత్తానికి తాగేశాడు సన్నీ. ప్రియాంక రవి చేత తాగించారు.
ఈ సీజన్ మొత్తంలో యాంకర్ రవిని టార్గెట్ చేసిన నాగార్జున తొలిసారిగా అతనిపై ప్రశంసలు కురిపించారు. కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌లో అద్బుతంగా ఆడాడని పొగిడారు. నీకు నరకం చూపించినా.. వెనక్కి తగ్గకుండా ఆడావ్.. శెభాష్ అంటూ చప్పట్లు కొట్టారు నాగార్జున. నామినేషన్లో ఉన్న వారిలో మొదటగా రవి సేవ్ అయ్యాడంటూ ప్రకటించారు నాగార్జున.