బిగ్ బాస్ హౌజ్‌లో రోజురోజుకు ఎమోషన్స్ స్ట్రాంగ్ అవుతున్నాయి. సిరి-షణ్ముఖ్, మానస్- ప్రియాంక మధ్య ఏం జరుగుతుందో తెలియక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముఖ్యంగా సిరి అయితే షణ్ముఖ్‌తో ఓ ఆట ఆడిస్తుంది. మొన్న ఆయనతో గుంజీలు తీయించిన సిరి శుక్రవారం రోజు అంతకన్నా ఎక్కువగా బ్రతిమలాడించుకుంది. ఇక పింకీ.. దేవుడు నాకు మంచి లైఫ్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అర్ధరాత్రి ఏడ్చింది.
నీతో హ్యాపీగా ఉండేదాన్నని మానస్‌తో గోడు చెప్పుకుంటూ బాధపడింది. దీంతో మానస్.. ఆమెను చేరదీసి ఓదార్చాడు. అలానే ‘నువ్వు కావాలని, ఏదో అనుకుని నాతో మాట్లాడుతున్నావు, నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలీదు అనుకోకు..’ అని చురకలంటించాడు. దీనికి పింకీ ఓకే అంటూ తలూపింది. ఇక నాగార్జున కెప్టెన్ అయిన అనీ మాస్టర్ని అభినందించాడు. గివ్ అప్ ఇవ్వకుండి ఆడు గెలుపు సాధ్యం అవుతుంది అని అన్నాడు.
ఇక కెప్టెన్‌గా, సంచాలక్‌గా నీకు నీవు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటావు అని నాగార్జున..షణ్ముఖ్‌ని అడగగా, దానికి ఏడు అని చెప్పాడు షణ్ణు. నేను 9 ఇస్తా అని అనడంతో షణ్ముఖ్ ఫుల్ ఖుష్ అయ్యాడు. సంచాలక్‌గా ఉన్న సమయంలో నీ పని అద్భుతంగా నిర్వర్తించావు. ఫ్రెండ్స్ విషయంలోను చాలా కఠినంగా ఉన్నావు అంటూ షణ్ముఖ్‌పై ప్రశంసలు కురిపించడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు. అలానే సిరి, షణ్ముఖ్ మధ్య ఉన్న ఇష్యూస్ కూడా క్లియర్ చేశాడు నాగ్.