Priyanka singh | ఎట్టకేలకు పింకీ ఎలిమినేట్ అయ్యిందిగా..

Bigg boss 5 telugu | బిగ్‌బాస్ 5 తెలుగు చూస్తుండగానే చివరి దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లోనే ఐదో సీజన్ ముగుస్తుంది. ప్రస్తుతం ఇంట్లో ఎవరూ కెప్టెన్ కూడా లేరు. చివరి కెప్టెన్‌గా షణ్ముఖ్ జస్వంత్ ఎంపికయ్యాడు. ఇదిలా ఉంటే 13వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి.. గత కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్, సన్నీ మినహా అందరూ నామినేట్ అయ్యారు. ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. షణ్ముఖ్, సన్నీని పక్కనపెడితే.. కాజల్, శ్రీరామచంద్ర, సిరి, ప్రియాంక సింగ్, మానస్ నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఎవరు ఎలిమినేట్ అయ్యారో కూడా తెలిసిపోయింది. ఎప్పట్లాగే ముందు రోజు సమాచారం బయటికి వచ్చేసింది. ఎట్టకేలకు 13 వారాల తర్వాత ఇంటి నుంచి బయటికి వచ్చేసింది పింకీ.
ఓటింగ్ పరంగా సిరి, శ్రీరామచంద్ర, మానస్ దూసుకుపోతున్నారు. ఆ తర్వాత కాజల్ నాలుగో స్థానంలో ఉంది. చివరి వరకు కూడా ఈమెతో పోటీ పడిన కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. ప్రస్తుతం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ లో వీక్ ఎవరు అంటే ప్రియాంక పేరు అందరికంటే ముందు వినిపిస్తుంది. గేమ్ పరంగానే కాకుండా టాస్కుల్లోనూ ఈమె పర్ఫార్మ్ చేయడం మానేసి చాలా రోజులు అయిపోయింది. కేవలం టార్గెట్ మానస్ అన్నట్లు ఆడుతుంది. పైగా ఆయనకు ఐ లవ్ యూ కూడా చెప్పింది. కాకపోతే ఈ విషయం మానస్ కు కాకుండా సన్నీతో చెప్పింది. ఈమె ఎక్కువగా తన స్నేహితులపై ఆధారపడుతుందని విమర్శలు ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మానస్ చుట్టూ ఈమె గేమ్ తిరుగుతోంది. దాంతో ఓటింగ్‌లో ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ వారం ఎలిమినేట్ అయిపోయింది ప్రియాంక సింగ్. నిజానికి గత వారమే ఈమె బయటికి వచ్చేయాలి.. అయితే చివరి నిమిషంలో రవిని ఎలిమినేట్ చేశారు. కానీ ఈ వారం అలాంటి మ్యాజిక్ ఏదీ జరగలేదు. మొత్తానికి ట్రాన్స్ జెండర్‌గా వచ్చి లాంగ్ జర్నీ చేసింది పింకీ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sanya Malhotra: నాలుగేళ్ల రిలేషన్ బ్రేకప్ కావడంతో డిప్రెషన్లోకి వెళ్లానంటున్న దంగల్ బ్యూటీ
Bigg Boss: టికెట్ టూ ఫినాలే విజేతగా శ్రీరామ్.. ప్రియాంకకి వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్
Sunny: సన్నీ ముఖంపైకి టిష్యూ విసిరేసిన కాజల్.. !
Siri: తొండి గేమ్ ఆడిన సిరి.. కాజల్‌పై మండిపడ్డ సన్నీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

