Gunturu Kaaram | సినిమా లవర్స్‌కు పండగే.. రేపు ఓటీటీలోకి 4 బడా సినిమాలు
This Week OTT Movies | గత రెండువారాలు నుంచి టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడంతో సినీ లవర్స్ అంతా ఓటీటీకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే, అయితే ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్‌లు కానీ మూవీలు కానీ విడుదల అవ్వలేదు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. రేపు మూడు పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటి అనేవి ఒకసారి చూసుకుంటే.
This Week OTT Movies | గత రెండువారాలు నుంచి టాలీవుడ్లో పెద్ద సినిమాలేవి థియేటర్లో లేకపోవడంతో సినీ లవర్స్ అంతా ఓటీటీకి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే, అయితే ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్‌లు కానీ మూవీలు కానీ విడుదల అవ్వలేదు. అయితే అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ.. ఈ వారం 4 పెద్ద సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇక ఆ సినిమాలు ఏంటి అనేవి ఒకసారి చూసుకుంటే..
‘గుంటూరు కారం’
Gunturu Kaaram | ప్రిన్స్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) కాంబోలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘గుంటూరు కారం’ (Gunturu Kaaram). అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా ఫిబ్రవరి 9 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కెప్టెన్ మిల్లర్
Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకు అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వం వహించగా.. కోలీవుడ్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. ఇక పోంగల్ కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తమిళనాట మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో ఈ సినిమాను జనవరి 26న విడుదల చేయగా ఇక్కడ కూడా మంచి కలెక్షన్స్ అందుకుంది. అయితే థియేటర్ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం నెల తిరగకుండానే ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా ఫిబ్రవరి 08 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అయాలన్
Ayalaan | కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ప్రధాన పాత్రలో నటించిన తాజా సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ (Ayalaan). ఈ సినిమాకు రవికుమార్ దర్శకత్వం వహించగా.. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్గా నటించింది. తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్ వేదికగా ‘అయలాన్’ (Ayalaan) ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా తమిళ వెర్షన్ మాత్రమే ఓటీటీలో విడుదల కాబోతుంది.
ది మార్వెల్స్
The Marvels | మార్వెల్ మూవీస్ (Marvel Studios). ఈ బ్యానర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన బ్లాక్ పాంథర్(Black Panther), ది ఎవెంజర్స్ (The Avengers), స్పైడర్ మ్యాన్ (Spider Man), కెప్టెన్ అమెరికా (Captain America) చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించాయి. అయితే గత ఏడాది మార్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రం ‘ది మార్వెల్స్’ (The Marvels). నియా డాకోస్టా (Nia DaCosta) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నవంబర్ 10న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలావుంటే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

