Vijay Deverakonda | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో అభిమానులను ఎంటర్టైన్ చేసే విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి (Kushi) సినిమాతో మూవీ లవర్స్‌ను ఖుషీ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది విజయ్ దేవరకొండ టీం.
కాగా ఇప్పుడు విజయ్ దేవరకొండ పెట్టిన పోస్ట్ ఒకటి అందరినీ ఆలోచన పడేసింది. చాలా జరుగుతున్నాయి. కానీ ఇది నిజంగా చాలా ప్రత్యేకమైనది. త్వరలో ప్రకటిస్తాం.. అంటూ అమ్మాయి చేతిలో చేయి వేసి ఉన్న స్టిల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇంతకీ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి ఏదైనా ముఖ్యమైన విషయాన్ని కానీ ప్రకటించబోతున్నాడా..? లేదంటే ఏదైనా సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నాడా..? మరి ఏదైనా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగంగానే ఇలా చేశాడా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
విజయ్ దేవరకొండ తన రియల్‌లైఫ్ ప్రేయసి ఎవరనే దానిపై క్లారిటీ ఇస్తాడేమోనని అని కామెంట్స్ పెడుతున్నారు కొందరు నెటిజన్లు. విజయ్ దేవరకొండ మరోవైపు జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వీడీ12 (VD12) చేస్తున్నాడని తెలిసిందే. కాప్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్-శ్రీకర స్టూడియోస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తన్నాయి. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) సంగీతం అందిస్తున్నాడు.