కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. చాలా వరకు సినిమాలు ఓటీటీలో విడుదలకి సిద్ధమవుతున్నాయి. గత వారం విడుదలైన సినిమాలలో ఏ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులని అలరించలేదు. ఇక ఈ వారం వినాయక చవితి సందర్భంగా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
నాని-శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన టక్ జగదీష్ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇక గోపీచంద్ హీరోగా దర్శకుడు సంపత్ నంది డైరెక్షన్ లో రానున్న ‘సిటీమార్’ సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుండగా.. తమన్నా తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్‌గా నటిస్తోంది.
దివగంత నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందింన తలైవి చిత్రం కూడా సెప్టెంబర్ 10న తెలుగు, తమిళం, హిందీ భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో, టాలెంటెడ్ డైరెక్టర్ ఏ ఎల్ విజయ్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘లాభం’.. సెప్టెంబరు 9న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇందులో శృతిహాసన్ కథానాయికగా నటించగా, జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. చైతూ నటించిన లవ్ స్టోరీ కూడా వినాయక చవితికి వస్తుందని అన్నారు. కాని పలు కారణాల వలన వాయిదా పడింది.