ఇటీవలే మసూద (Masooda) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు టాలెంటెడ్ నటుడు తిరువీర్ (Thiruveer) . ఈ యంగ్ హీరో ప్రస్తుతం పరేషాన్ అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర టీజర్ (Pareshan teaser) ను మేకర్స్ లాంఛ్ చేశారు. తెలంగాణలోని ఓ గ్రామంలో స్నేహితుల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంలో కొంచెం ఫన్‌గా, సీరియస్‌గా సాగుతున్న టీజర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
తిరువీర్ గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో పావని కరణం నటిస్తోంది. తిరువీర్ అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎలాంటి సమస్యల్లో పడతారు.. వాటి నుంచి ఎలా బయటపడ్డారనే విషయాన్ని డైరెక్టర్ సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నట్టు టీజర్‌తో అర్థమవుతుంది. మొత్తానికి తిరువీర్ ఈ సారి మాత్రం పక్కా ఎంటర్టైనింగ్ సినిమాతో రాబోతున్నాడని టీజర్‌తో తెలిసిపోతుంది.
పరేషాన్ లో బన్నీ అభిరాన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వాల్తేరు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సిద్దార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ రానుంది. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నాడు.
పరేషాన్ టీజర్..