Sonal Chauhan | రెయిన్ బో సినిమాతో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది కాన్పూర్ సుందరి సోనాల్ చౌహాన్ (Sonal Chauhan). తెలుగులో లెజెండ్ సినిమాతో మంచి బ్రేక్ అందుకున్న ఈ బ్యూటీ తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారు మతులు పోగొట్టే ఈ బ్యూటీ తాజాగా మరో స్టిల్‌తో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
సోనాల్ చౌహాన్ ఓ స్విమ్మింగ్ పూల్ (Swimming Pool) దగ్గర స్విమ్ వేర్లో గ్లామరస్‌గా కనిపిస్తూ.. టోపీ పెట్టుకుని దిగిన స్టిల్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. నేను లోపలికి దూకుతానా..? అని ఆలోచిస్తున్నానంటూ క్యాప్షన్‌గా పెట్టింది. దీనికి నెటిజన్లు తమదైన స్టైల్లో కామెంట్స్ పెడుతున్నారు. మనిద్దరం కలిసి దూకితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందోనని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఆగండి దూకొద్దు.. నేనొస్తా.. ఇద్దరం కలిసి దూకేద్దాం.. అని మరో నెటిజన్ కామెంట్ పోస్ట్ చేశారు. నువ్వు ఇప్పటికే నా హృదయంలోకి దూరేశావ్.. అని మరో యూజర్ రాసుకొచ్చారు. ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.
సోనాల్ చౌహాన్ గతేడాది ఎఫ్3, ది ఘోస్ట్ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.
Thinking if I should jump in ….. 🏊♀️ #love #SonalChauhan #pool pic.twitter.com/hROAVEfmBw
— SONAL CHAUHAN (@sonalchauhan7) April 9, 2023
Read Also :
MalaikottaiVaaliban | ప్రీ లుక్‌తో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్
Karthik Ghattamaneni | పుకార్లకు చెక్ పెట్టిన రవితేజ డైరెక్టర్..
Mrunal Thakur | చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటోన్న మృణాళ్ ఠాకూర్