బాలీవుడ్లో ఇపుడు డైరెక్ట్ హిందీ సినిమాల కంటే రీమేక్ (Hindi remakes) సినిమాలే ఎక్కువ క్రేజీ తెచ్చుకుంటున్నాయి. దక్షిణాది చిత్రాలైన జెర్సీ, అర్జున్ రెడ్డి, సింగంతోపాటు చాలా సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి. తాజాగా మరో క్రేజీ సినిమా సూరారై పోట్రు ( తెలుగులో ఆకాశం నీ హద్దురా)ను హిందీలో (Soorarai Pottru Hindi remake) రీమేక్ చేస్తున్నారన్న న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఒకవేళ అన్నీ అనుకుంటున్నట్టు కుదిరితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), హీరోయిన్ అపర్ణ బాలమురళి (Aparna Balamurali) ఒరిజినల్ వెర్షన్ లో చేసిన పాత్రలను హిందీలో ఎవరు చేస్తారనే దానిపై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెరపైకి వచ్చింది.బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay kumar), హీరోయిన్ రాధికా మదన్ (Radhika Madan)హిందీ రీమేక్‌లో నటించబోతున్నారట. తెలుగు, తమిళ వెర్షన్లకు దర్శకత్వం వహించిన సుధా కొంగర హిందీ రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనుందని తాజా టాక్.
బీటౌన్ టాక్ ప్రకారం..ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వెస్టర్న్ ఇండియాకు తగినట్టుగా, మహారాష్ట్ర రూరల్ ఏరియాకు చెందిన యువతిగా రాధికా మదన్ పాత్రను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రీమేక్ సెట్స్ పైకి తీసుకెళ్లే ముందే రాధికా మదన్ ఆ ప్రాంతానికి సంబంధించిన మాండలికం (యాస)ను నేర్చుకోవాలని ఫిక్స్ అయిందట.
అక్షయ్, రాధికా మదన్ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. అక్షయ్ కుమార్ ప్రస్తుతం పృథ్విరాజ్, రక్షాబంధన్, రామ్ సేతు, ఓ మై గాడ్ 2, సెల్ఫీ, గోర్ఖా సినిమాల్లో నటిస్తున్నాడు. రాధికా మదన్ పిప్పా, సనా చిత్రాలతో బిజీగా ఉంది.