Kubera | ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద హిట్ సాధించిన చిత్రం కుబేర. నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రలలో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళంలో కన్నా తెలుగులోనే ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం రోజురోజుకు కలెక్షన్లు పెంచుకుంటూ పోతుంది. పాజిటివ్ టాక్ వలన థియేటర్లు కళకళ్లాడుతున్నాయి. అయితే, తెలంగాణలోని ఓ థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలింది.దీంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు కొందరు గాయపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా, ముకుంద థియేటర్ లో సంభవించిన ప్రమాదంతో ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారు. సెకండ్ షో నడుస్తున్నప్పుడు, ప్రేక్షకులు అందరు సినిమాలో మునిగిపోయారు. ఆ సమయంలో సీలింగ్ కూలిపోవడం వల్ల ప్రేక్షకులలో ఒక్కసారిగా భయాందోళన ఏర్పడింది. పై నుండి కూలిన సీలింగ్ వలన కొందరు ప్రేక్షకులు స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. అయితే, థియేటర్ సిబ్బంది వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించారు.
ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణలో లోపాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ‘కుబేర’ సినిమా అమెరికాలో ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల మార్క్ దాటింది. ఇది నాగార్జున కెరీర్లో అరుదైన రికార్డ్‌గా చెప్పవచ్చు. వీకెండ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.
థియేటర్లో కుబేర సినిమా చూస్తుండగా కూలిన థియేటర్ సీలింగ్.. పలువురికి స్వల్ప గాయాలు
మహబూబాబాద్‌లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడి పడిన సీలింగ్ పైకప్పు.. పలువురికి స్వల్ప గాయాలు
దీంతో థియేటర్ యాజమాన్యంతో రాత్రి గొడవకు… pic.twitter.com/XHgEq2c8vV
— Telugu Scribe (@TeluguScribe) June 26, 2025