అంచనాలు నిజమయ్యాయి
“ది వారియర్’ చిత్రానికి అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది. సంధ్య థియేటర్లో ప్రేక్షకుల మధ్య ఫస్ట్‌షో చూశా. రామ్ క్రేజ్ ఎలాంటిదో అర్థమయింది. తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో మరిన్ని స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు చేస్తాను’ అన్నారు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రామ్, కృతిశెట్టి జంటగా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ‘ది వారియర్’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. రామ్ మాట్లాడుతూ ‘విడుదలైన సమయంలో వర్షాల వల్ల ఎన్నో అడ్డంకులు వచ్చినా మా టీమ్ అంతా వారియర్స్‌లా నిలబడ్డారు. ప్రతికూల పరిస్థితుల్లో తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఈ సినిమా విషయంలో మా అంచనాలన్నీ నిజమయ్యాయి. ఇదే బ్యానర్లో నా తదుపరి చిత్రాన్ని చేస్తున్నా’ అన్నారు. ‘వర్షాల్లో కూడా మంచి ఓపెనింగ్స్ లభిస్తున్నాయి. ప్రేక్షకులు కోరుకునే కమర్షియల్ అంశాలన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. నేను పోషించిన గురు పాత్రకు మంచి స్పందన లభిస్తున్నది’ అని ఆది పినిశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
Telugu Cinema | హింసే పరమావధిగా టాలీవుడ్ సినిమాలు.. వెనకబడుతున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

