Javed Akhtar | రెండుమూడు యానిమల్స్ చేసుకో మాకేంటి?.. ఆ దర్శకుడిపై జావెద్ అక్తర్ ఫైర్
దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్' సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం.
Javed Akhtar | దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్’ సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం.’ అంటూ ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై వెంటనే దీటుగా స్పందించారు సందీప్‌రెడ్డి. ‘జావెద్ సార్ రాసిన సినిమాల్లో ఇప్పటివరకూ ఒక్క అసభ్యకర సన్నివేశం నేను చూడలేదు. రచయితగా ఆయన్ను విమర్శించే స్థాయి నాది కాదు. అయితే.. ఆయన మనవడు ఫర్హాన్ అక్తర్ ‘మీర్జాపూర్’ అనే వెబ్ సిరీస్ తీశాడు. అందులో అన్నీ బూతులే. మరి ఈ నీతులేవో తన తనయుడికి కూడా చెబితే బావుండేది కదా.’ అని సందీప్ కౌంటర్ ఇచ్చారు.
ఈ కౌంటర్‌తో గొడవ చల్లారిందిలే అని అందరూ భావించిన సమయంలో.. మళ్లీ సందీప్‌పై జావెద్ కౌంటర్ ఎటాక్ చేశారు. ‘నా కెరీర్లో ఎక్కడా ఒక్క అసభ్య సన్నివేశం కూడా చూడలేదని అతనన్నాడు.. సంతోషం. అందుకే నన్ను అనలేక నా తనయుడ్ని టార్గెట్ చేశాడు. తనికి తెలియని విషయం ఏంటంటే.. ‘మీర్జాపూర్’ సిరీస్‌లో నా తనయుడు నటించలేదు.
దర్శకుడు కూడా కాదు. వేరేవాళ్లతో నిర్మించాడు. ప్రజాస్వామ్య దేశంలో నచ్చినట్టు సినిమాలు తీసుకునే హక్కు అందరిదీ. ఇంకో రెండుమూడు ‘యానిమల్స్’ని తీయమనండి… నాకెందుకు.’ అంటూ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు జావెద్. మరి దీనిపై సందీప్ స్పందనేంటో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

